పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మొహానికి రంగు పూసుకొని వెండితెరపై కనిపించటానికి సిద్దమవుతున్న వేళ... కరోనా రక్కసి భారతదేశం పై అడుగు మోపి అందరి ఆశలపై నీళ్లు చల్లింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్ర షూటింగులో నటించాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు సినిమా చిత్రీకరణ 80% పూర్తయిందని... పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సన్నివేశాలు ఇరవై రోజుల పాటు చేస్తే సినిమా పూర్తవుతుందని సమాచారం.


ఐతే వకీల్ సాబ్ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తే బాగా డబ్బులు వసూల్ చేయవచ్చనే ఆలోచనలో ఆ సినీ బృందం ఉందట. ఏది ఏమైనా సినిమా షూటింగ్ ప్రారంభం కావడం ప్రస్తుతం పెద్ద సమస్యగా కనిపిస్తుంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడితే చిత్రీకరణలు ప్రారంభమవుతాయని తెలుస్తుంది కానీ వైరస్ వ్యాప్తి మాత్రం విస్తరిస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఒక సంగీత దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కుతున్నాడు


వివరాలు తెలుసుకుంటే... వకీల్ సాబ్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఐతే పవన్ కళ్యాణ్ సినిమాలో పాటలు మంచి గా ఉన్నవి మాత్రమే ఎక్కువగా హిట్ అవుతుంటాయి. ఉదాహరణకి జల్సా, తొలిప్రేమ ఇంకా అతని ఇతర బ్లాక్ బాస్టర్ హిట్స్ అయిన సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి. అందుకే వకీల్ సాబ్ చిత్రంలో కూడా పాటలు సూపర్ గా ఉండాలని ఒత్తిడి తెచ్చారట. ఇప్పటికే ఆ చిత్రం నుండి 'మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా' అనే అద్భుతమైన పాట అంతర్జాతీయ మహిళా దినోత్సవం సూపర్ హిట్ గా నిలిచింది.


మిగతా పాటలు కూడా అదే స్థాయిలో ఉంటాయని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చే విధంగా ఎస్.ఎస్.తమన్ పాటలను కంపోజ్ చేశాడట. ఈ విషయాలన్నీ తమన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ మూవీ పని అయిపోయినట్టే... పాటలు సంభందించిన వర్క్ మొత్తం అయిపోయిందని చెప్పుకొచ్చాడు. పాటలన్ని చాలా చక్కగా వచ్చాయట. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన అనంతరం వకీల్ సాబ్ కి సంబంధించిన ఒక్కో పాట రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: