టాలీవుడ్ లో మోస్ట్ హీరోయిన్లు గా చలామణి అవుతున్న వారిలో తమన్నా పేరు కూడా మెయిన్ గా వినపడుతుంది. ఎన్నో సినిమాలలో నటించిన తమన్నా అందరి చేత మిల్క్ బ్యూటీ అని పిలిపించుకుంటుంది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 15 ఏళ్ళు దాటిపోయింది. 2005లో శ్రీ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన ఈ బ్యూటీ..ఎన్నో విజయాలను అందుకోవడమే కాకుండా ఎన్నో హిట్ సినిమాలలో కూడా నటించింది..

 

 

 

 

 

 

ఆ సినిమాలో అమ్మడుకు మంచి మార్కులు పడటంతో వరుస సినిమాలలో నటిస్తూ..మంచి విజయాలను అందుకుంది.. అప్పట్నుంచి ఇప్పటి వరకు వరసగా సినిమాలు చేస్తూనే ఉంది. దాదాపుగా 50 సినిమాల మైలురాయి కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో సినిమాలు చేసినా కూడా ఇప్పటి వరకు తాను చేయని పాత్ర తనకు ఇచ్చినందుకు దర్శకుడు అనిల్ రావిపూడికి థ్యాంక్స్ చెప్పుకుంది. 

 

 

 

 

 

 

ప్రస్తుతం ఈయన తెరకెక్కిస్తున్న తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా. అందులో కొత్తేముంది అనుకోవచ్చు కానీ మిలటరీ వాళ్ల మధ్య ఐటం సాంగ్ చేసింది .తన కెరీర్లో ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసినా.. ఐటం సాంగ్స్ కూడా చేసినా కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ ఆర్మీ డ్రస్ మాత్రం వేసుకోలేదని చెప్పింది మిల్కీ బ్యూటీ. ఫస్ట్ టైమ్ తన కెరీర్లో ఇలాంటి ఆఫర్ ఇచ్చినందుకు అనిల్ చాలా థ్యాంక్స్ అంటుంది ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. 

 

 

 

 

జనవరిలో విడుదలయిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ అందుకోవడం తో పాటుగా భారీ వసూళ్లను కూడా అందుకుంది.. కచ్చితంగా ఈ పాటతో పాటు సినిమా కూడా ప్రేక్షకులను బాగా అలరించిన సంగతి తెలిసిందే.. అందులో ముఖ్యంగా డాంగ్ డాంగ్ సాంగ్ మేకింగ్ వీడియో కూడా అదిరిపోయింది. ఇందులో అనిల్ రావిపూడి కూడా తమన్నాతో పాట విశేషాలతో పాటు మరిన్ని వివరాలను తెలిపింది.. ప్రస్తుతం తమ్మూ హిందీ సినిమాలలో నటిస్తుంది.. తెలుగు , తమిళ్ , హిందీ చిత్రాలలో తమన్నా నటిస్తుంది..తెలుగులో గోపీచంద్ , గోపి చంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సీటిమార్ సినిమాలో నటిస్తుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: