'శ్రీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ తమన్నా భాటియా. 'హ్యాపీడేస్' సినిమాతో అమాంతం క్రేజ్ పెంచేసుకుంది. తక్కువ కాలంలోనే అగ్ర కథానాయకులతో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకుంది. దాదాపు టాలీవుడ్ లో అందరు హీరోలతో అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంది. ఛాన్స్ వచ్చినప్పుడు ఆ సినిమా చిన్నదా పెద్దదా అనే బేధాలు లేకుండా నటించి బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్లలో తమన్నా ఒక్క ఏడాది కూడా సినిమా ఛాన్సెస్ లేక ఖాళీగా ఉండలేదంటేనే తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మకి ఉన్న క్రేజ్. గత ఏడాది ఏడు సినిమాల్లో నటించిన తమన్నా ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో మహేష్ బాబు పక్కన డాంగ్ డాంగ్ అనే పాటలో చిందులేసింది. టాలీవుడ్ 'మిల్కీ బ్యూటీ'గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా జయాపయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న తమన్నా ఎందుకో గాని అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. 

 

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నడుస్తుండటంతో సెలబ్రెటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ని రకరకాల వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే హీరోహీరోయిన్లు తమకు దొరికిన ఈ అవకాశంతో కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఇంట్లో చేసే వంటల వీడియోలను.. ఫోటోలను.. హోమ్ వర్క్ ఔట్ వీడియోలను..టిక్ టాక్ వీడియోలను.. డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ కొందరు సెలబ్రెటీలు మాత్రం ఇన్ని రోజులు తమలో దాగున్న టాలెంటుని బయటపెడుతున్నారు. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఒక కొత్త భాష నేర్చుకునే పనిలో పడిందంట. అయితే ఆ కొత్త భాష తన మాతృ భాష 'సింధీ' నేర్చుకుంటుందట. అది తన మాతృ బాషా అయినప్పటికీ తనకు మాట్లాడటం రాదట. తెలుగు తమిళ్ బాషలపైనా పట్టు వచ్చింది కానీ సింధి మాత్రం మాట్లాడటం రావడంలేదట. ఇక ఇప్పుడు కావాల్సినంత టైం దొరకడంతో ఇంట్లో తనతో సింధి లోనే మాట్లాడమని చెప్పిందట. ఈ ఏడాది పూర్తయ్యేలోపు సింధి పైన పట్టు సాధిస్తా అంటుంది మిల్కీ బ్యూటీ. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో నవాజుద్దీన్ సిద్ధికీ సరసన 'బోలే చుడియా' సినిమాలో నటిస్తోంది తమన్నా. మన టాలీవుడ్ విషయానికొస్తే గోపీచంద్ సరసన 'సీటిమార్' సినిమాలో నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: