పెళ్ళై ఏడాది గడవక ముందే మహానటి సౌందర్య దురదృష్టవశాత్తూ హెలికాప్టర్ ఆక్సిడెంట్ లో ఏప్రిల్ 17, 2004 లో మరణించారు. ఆమెతో పాటు సోదరుడు అమర్నాథ్ కూడా ఈ ప్లేన్ క్రాష్ లోనే చనిపోయాడు. అప్పట్లో ఈ విషాదకరమైన దుర్ఘటన అందర్నీ ఎంతగానో కలిచివేసింది. 1992 వ సంవత్సరంలో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన సౌందర్య వందకు పైగా తెలుగు తమిళ కన్నడ మలయాళ చిత్రాల్లో నటించి అభినయ సావిత్రి అనే బిరుదు సంపాదించుకుంది. ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి హిందీ లో కూడా సూర్యవంశ్ అనే చిత్రంలో నటించి పేరు ప్రఖ్యాతలు గడించి విజయఢంకా మ్రోగించింది.


సావిత్రి తర్వాత మళ్లీ తెలుగు పరిశ్రమలో అంతటి పేరుని సంపాదించింది కేవలం సౌందర్య మాత్రమేనని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో హీరోలకి సమానం గా సౌందర్య తన సినిమాలతో పారితోషికం తీసుకునే వారట. ఆమె మరణించే రోజుకి వంద కోట్లకు పైగా రూపాయలను సంపాదించిందట. ఏది ఏమైనా సౌందర్య తన జీవితంలో అనుభవించకుండానే కేవలం 31 సంవత్సరాల వయసులోనే మరణించింది. ఐతే ఇప్పటివరకు ఆమె బయోపిక్ చేద్దామని ఎవరూ అనుకోలేదు. ఒకవేళ ఆమె బయోపిక్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే... ఆమె పాత్రలో కీర్తి సురేష్ నటిస్తే అద్భుతంగా ఉంటుంది.


అలనాటి అందాల తార గొప్ప నటి సావిత్రి బయోపిక్ లో కీర్తి సురేష్ ఎంత బాగా నటించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌందర్య బయోపిక్ లో ఒక వేళ ఈమెకు నటించే ఛాన్స్ లభిస్తే... ఆమె మళ్లీ తన నటనా చాతుర్యంతో వెండితెరపై సౌందర్యని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది అని ఏ సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. అలాగే ఈ చిత్రాన్ని ఎవరైనా ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తే ఇంకా బాగుంటుంది అని భావించవచ్చు. మరి భవిష్యత్తులో అయిన నేటితరం వారికి సౌందర్య గొప్పతనం తెలిసేలా ఆమెపై ఒక బయోపిక్ చేస్తారో లేదో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: