మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మణిమకుఠంలా నిలిచిపోయిన సినిమా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. ఈ సినిమా విడుదలై నేటితో 30ఏళ్లు పూర్తయ్యాయి. భీకర తుఫాను పరిస్థితుల మధ్య 1991 మే9న ఈ సినిమా విడుదలయింది. తుఫాను, భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా ఈ సినిమాపై ప్రేక్షకాభిమానులు చూపిన అభిమానం, సృష్టించిన ప్రభంజనం ఇప్పటికీ కథలుగా చెప్పుకోవడం ఈ సినిమా గొప్పదనం. తెలుగు సినిమా క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయిన ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాలు చెప్పుకొచ్చారు.

IHG

 

‘దర్శకుడిగా రాఘవేంద్రరావుకే ఈ సినిమాలో అగ్ర తాంబూలం దక్కుతుంది. కథకు ప్రాణ ప్రతిష్ట చేసి ఈ సినిమాను క్లాసిక్ గా మలిచారు. శ్రీదేవి లేకపోతే ఈ సినిమా లేదు. ఆమె అందం, దేవకన్యగా ఆమె రూపం సినిమాకు మేజర్ ఎస్సెట్. ఓ మాటలో చెప్పాలంటే ఆమెతో నటించడానికి నేను పోటీ పడ్డాను. కెమెరామెన్ విన్సెంట్ పనితనం ఈ సినిమాకు వరం. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ లేని రోజుల్లోనే అంతటి భారీతనం తీసుకొచ్చారు. కొన్ని సెట్టింగ్స్ ను కూడా నిజమైన హిమాలయాల్లా చూపించారు. శ్రీదేవి స్వర్గానికి వెళ్లే సమయంలో తీసిన ఫోటోగ్రఫీ అత్యద్భుతం. పాటల పరంగా వేటూరి రాసిన ప్రతి పాట ఆణిముత్యం. అబ్బనీ తియ్యనీ దెబ్బ, ప్రియతమా, అందాలలో.. ఇలా ప్రతిపాటను వీనులవిందుగా మలిచారు.’

IHG

 

‘నిర్మాతగా అశ్వనీదత్ ఎప్పుడూ లాభాలను చూడలేదు. ఖ్యాతి గురించే ఆలోచించారు. ఆయనకు ఈ సినమా ఓ జ్ఞాపకం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ విజయం దక్కుతుంది. సమిష్టి కృషికి ఈ సినిమా విజయం ఓ ఉదాహరణ’ అంటూ తన అనుభవాలను చెప్పుకొచ్చారు. ఇన్నేళ్లయినా ఇంకా జగదేకవీరుడు అతిలోకసుందరి ఫ్లేవర్ తాలూకు పరిమళాలు వెదజల్లుతూ ఉండడం నిజంగా విశేషమే.

మరింత సమాచారం తెలుసుకోండి: