ఆర్తి అగర్వాల్... ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. వెంకటేష్, తరుణ్, నాగార్జున లాంటి బడా హీరోల సరసన నటించిన ఆర్తి అగర్వాల్ అర్థాంతరంగా చనిపోయారు. స్థూలకాయం, దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ లైఫో సెక్షన్ సర్జరీ చేయించకుంటూ చికిత్స వికటించి ఆమె మరణించిందని మనందరికీ తెలుసు. 2001వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆర్తి అగర్వాల్ దాదాపు 25 సినిమాలకి పైగా నటించి అందరినీ ఎంతగానో అలరించింది.


తరుణ్ సరసన నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆమె నటనకు తెలుగునాట ప్రజలు మంత్ర ముగ్ధులై అయ్యారు. ప్రభాస్ సరసన అల్లరి రాముడు చిత్రం లో కూడా ఈమె తన అందచందాలతో అభినయంతో అందరినీ బాగా ఎంటర్టైన్ చేసింది. హీరోగా అవతారమెత్తిన సునీల్ సరసన ఆర్తి అగర్వాల్ నటించి అతడికే ఓ హిట్ అందించడంలో ఎంతో సహాయం చేసింది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నీ స్నేహం సినిమాలో ఆర్తి అగర్వాల్ చాలా అద్భుతంగా నటించి ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డులకు ఎంపికయింది.


ఇకపోతే ఆమె సహాయ నటీగా నేనున్నాను చిత్రంలో చాలా చక్కగా నటించింది. సంక్రాంతి గోరింటాకు, బ్రహ్మలోకం టూ యమలోకం లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో స్థిరస్థాయిగా నిలిచి పోయింది. ఐతే అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపించే ఈమె అమెరికాలో పుట్టి పెరిగింది. ఆ క్రమంలోనే ఒకానొక సమయంలో అమితాబ్ బచ్చన్ ఆర్తి అగర్వాల్ ని చూసి ముచ్చటపడి ఆమె పెద్ద హీరోయిన్ అవుతుందని నటనా రంగంలో అడుగుపెట్టాలని గీత గోదా చేయగా ఆమె బాలీవుడ్ సినీ రంగం లో అరంగేట్రం చేసి మొట్టమొదటి సినిమాతోనే ఎనలేని పాపులారిటీని అందుకుంది.


అయితే ఈ పాపులారిటీ ఆమెను ఎంతగానో సంతోష పరచలేదు. వివాహమైన తర్వాత కూడా ఆమె వైవాహిక జీవితం సరిగా నడవక విడాకులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు ఆమెను పొట్టనబెట్టుకున్నాయి. అయితే ఈమె బయోపిక్ ఒకవేళ మన తెలుగులో తెరకెక్కిస్తే... జర్నీ ఫేమ్ అంజలిని ఎంపిక చేస్తే బాగుంటుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో అంజలి అసలు సిసలైన నటనా చాతుర్యం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఆమెకు ఆర్తి అగర్వాల్ పాత్రలో నటించడం పెద్ద చాలెంజ్ ఏమీ కాదని నిస్సందేహంగా చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: