అవును  ఇది నిజమే. అన్ని మార్పుల్లో  భాగంగా ఇది కూడా జరుగుతోంది అనుకోవాలి. ఓ విధంగా ఇది అనివార్యం అంటున్నారు. సినిమా అన్న ప్రక్రియకు ఇపుడు పెద్ద చిక్కు వచ్చిపడింది. తెర మీద బొమ్మలకు కత్తెర పడుతోంది అని అంతా ఆందోళన పడుతున్నారు. దీనికంతటికీ కారణం కరోనా మహమ్మారి. అవును కరోనా వచ్చి కాటేయకపోతే ఈ సమ్మర్ లో దిమ్మదిరిగే కలెక్షన్లు ఉంటాయి.

 

సరే ఇపుడు వచ్చింది పెద్ద కష్టం. దానికి తగిన విధంగా పరిష్కారం చూసుకోవాలి తప్పదు. లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది. ఈ సంగతి తెలుసుకున్న తెలివి గల ధియేటర్ యజమానులు సరికొత్త ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ తెర మీద బొమ్మను  ఆడిస్తామని చెబుతున్నారు.

 

తమ సినిమా  హాల్ కెపాసిటీని సగానికి సగం చేస్తామని అంటున్నారు. ప్రతీ సీటుకూ  మధ్య రెండేసి సీట్ల గ్యాప్ ని పెట్టి మరీ సినిమా టికెట్లు విక్రయిస్తామని అంటున్నారు. అదే ఫ్యామిలీ వస్తే వారికి మాత్రం ఒకే వరసలో టికెట్లు ఇస్తామని కూడా చెబుతున్నారు. ఇక సినిమా హాళ్ళను ఎప్పటికపుడు పరిశుభ్రంగా ఉంచడమె కాదు, శానిటైజేషన్ ఎప్పటికపుడు చేస్తూ ఉంటామని హామీ ఇస్తున్నారు.

 

వచ్చిన వారందరికీ కరోనా లేదని నిర్ధారణ కొరకు  ధర్మల్ స్క్రీనింగ్ చేసి మరీ సినిమా హాల్లోపలికి అనుమతిస్తామని అంటున్నారు. ఆ విధంగా చేయడానికి అవకాశం ఇస్తే తెర మీద బొమ్మ పడుతుందని, దాంతో తమ బతుకులు కూడా బాగుంటాయని అంటున్నారు. వచ్చిన ఉపద్రవం వల్ల పూర్తిగా సినిమా హాళ్ళను మూసేస్తే ఈ వ్యాపారం మీద ఆధారపడిన వారంతా పూర్తిగా  మునిగిపోతారని అంటున్నారు.

 

మరిపుడు దేశమంతా లాక్ డౌన్లో ఉంది. లాక్ డౌన్ ఎత్తేశాక సినిమా హాళ్ళలో సినిమాలు ఆడాలంటే ధియేటర్ల యజమానులు ఇస్తున్న సూచనలు పరిశీలిస్తూ ప్రభుత్వాలు కూడా గైడ్ లైన్స్ కొత్తగా ఇస్తే దానిని బట్టి బొమ్మ పెట్టె తెరచుకునే అవకాశం ఉంటుందేమో చూడాలి. ఒకవేళ ఈ విధంగా అనుమతులు ఇస్తే మాత్రం సినిమాలకు ఇక హౌస్ ఫుల్స్ ఉండవు. సగం జనంతోనే బొమ్మ ఆడాల్సి ఉంటుంది, మరిది హీరోలకు, వారి ఫ్యాన్స్ కి కొంత షాకింగ్ న్యూసే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: