యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి తర్వాత క్రేజ్ అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే బాహుబలి తర్వాత చాలా సమయం తీసుకుని చేసిన సినిమా సాహో అనుకున్ననంత విజయం అందుకోకపోయినా ప్రభాస్ కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సినిమా దక్షిణాదిన హిట్ అవ్వకపోయినా నార్త్ ఇండియా లో మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీని తో అక్కడ కూడా ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమా హిందీ లో మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టింది. 

 

తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు నార్త్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ నేపధ్యంలో అన్ని సినిమా షూటింగ్ లు నిలిచి పోయాయి. దీని తో ఇళ్ల కే పరిమితమైన  ప్రేక్షకులు యు ట్యూబ్ చానెల్స్ ద్వారా సినిమాలను చూస్తున్నారు. దీని కారణంగా అన్ని రకాల సినిమాలకు యు ట్యూబ్ చానెల్ లో ఎక్కువ సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. తాజాగా బార్క్ అనే సంస్థ ఏప్రిల్ 25 నుండి మే 1 వరకు టెలికాస్ట్ అయిన సినిమాలకు రేటింగ్స్ ఇచ్చింది.

 

బార్క్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం మన యంగ్ రెబల్ స్టార్ బాలీవుడ్ హీరోలను బీట్ చేస్తూ తన హవా  కొనసాగిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే యాక్షన్ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కిన సినిమా సాహో హిందీ వెర్షన్ చానెల్ లో టెలికాస్ట్ అయ్యి 83.34లక్షల ఇంప్రెషన్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది. అంతేకాక బాహుబలి  ది బిగినింగ్ హిందీ వెర్షన్ 73.89 లక్షల వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఈ విధంగా ప్రభాస్ బాలీవుడ్ స్టార్ లను బీట్ చేస్తూ మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నాడు. తర్వాతి స్థానాల్లో అక్షయ్ కుమార్, అమితాబ్ సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: