అక్కినేని నాగార్జున కెరీర్లో గీతాంజలి, శివ, సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. తర్వాత ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ప్రెసిడెంట్ గారి పెళ్లాం సినిమాతో మొదలు వరుస హిట్లు ఇచ్చాడు. దశాబ్దం తర్వాత నాగార్జునకు ఇదే పరిస్థితి ఎదురైంది. నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య తర్వాత దాదాపు ఫ్లాపులే ఇచ్చాడు. ఈ సమయంలో కూడా నాగార్జున ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోనే సక్సెస్ ట్రాక్ ఎక్కి వరుస హిట్లు ఇచ్చాడు. ఆ ఫ్యామిలీ ఎంటర్టైనరే ‘సంతోషం’ సినిమా. ఈ సినిమా విడుదలై నేటితో 18ఏళ్లు పూర్తయ్యాయి.  

IHG

 

దశరధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2002 మే9న విడుదలైంది. దర్శకుడికి తొలి సినిమానే ఫస్టాఫ్ లో ప్రేమ, సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్ ను సమపాళ్లలో తెరకెక్కించాడు దర్శకుడు. ఇద్దరు హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో మెయిన్ రోల్ కు లగాన్ తో పేరు తెచ్చుకున్న గ్రేసీ సింగ్ ను తీసుకున్నారు. మరో హీరోయిన్ గా ముందు ఏడాది ఇష్టం సినిమాతో పరిచయమైన శ్రియను తీసుకున్నారు. ఇద్దరూ తమ పాత్రల్లో రాణించారు. ముఖ్యమైన పాత్రలో ప్రభుదేవా, కె విశ్వనాధ్, పృథ్వీ, కోట, బ్రహ్మానందం నటించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతంలోని పాటలు మంచి హిట్టయ్యాయి.

IHG

 

సినిమా థీమ్ అంతకు నాలుగేళ్ల ముందు వచ్చిన షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ మూవీ కుచ్ కుచ్ హోతాహైకు దగ్గరగా ఉంటుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నాగార్జున కెరీర్లో మరో సూపర్ హిట్ గా నిలిచింది. నాగార్జున చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. ఈ సినిమా తర్వాత శ్రియ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 24 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుని అందరికీ సంతోషం పంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: