ప్రస్తుత టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ నేడు తన 30వ పుట్టినరోజుని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ముందుగా నువ్విలా సినిమా ద్వారా చిన్న ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కి పరిచయం అయిన విజయ్, ఆపై మెల్లగా అక్కడక్కడా సినిమాల్లో నటించాడు. అనంతరం ఆయన పోషించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని పాత్ర విజయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తరువాత కొంత గ్యాప్ అనంతరం విజయ్ స్నేహితుడు తరుణ్ భాస్కర్ తొలిసారిగా ఆయనను హీరోగా పెట్టి పెళ్లిచూపులు అనే క్లాస్ మూవీ ని తీయడం, ఆ సినిమా మంచి ప్రేక్షకాభిమానంతో విజయవంతం అవడం జరిగింది. 

 

ఆపై సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించిన అర్జున్ రెడ్డి సినిమా సెన్సేషనల్ హిట్ కొట్టి, విజయ్ ని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. ఆపై పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమాతో మరొక అద్భుత విజయన్ని అందుకున్న విజయ్, అనతికాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఇటీవల వరుసగా కొంత ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న విజయ్, ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే నేడు బర్త్ డే సందర్భంగా తన నెక్స్ట్ సినిమాని విజయ్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఇటీవల మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమా తీసి మంచి హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, అతి ఆత్వరలో ఎఫ్ 3 సినిమా చేయనున్న విషయం తెలిసిందే. 

 

అయితే ఆ సినిమాలో వరుణ్ తేజ్, వెంకటేష్ లతో పాటు మూడవ హీరో కూడా ఉండనున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా అనిల్ చెప్పడం జరిగింది. కాగా ఆ హీరో విజయ్ అని సమాచారం. నేడు ఉదయం ఎఫ్3 స్టోరీ విజయ్ కు దర్శకుడు అనిల్ రావిపూడి వినిపించడం జరిగిందని, కాగా ఆ కథ విన్న విజయ్, అది తనకు ఎంతో నచ్చడంతో వెంటనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం, స్టార్ అయిన తరువాత విజయ్ నటించబోయే తొలి మల్టీస్టారర్ సినిమా ఇదే అవుతుంది అని చెప్పవచ్చు.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: