బాలక్రిష్ణకు సినిమాలు అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే చదువుకుంటూండగానే సినీ రంగ ప్రవేశం చేశారు. కేవలం 14 ఏళ్ల వయసులోనే తాతమ్మ కల మూవీలో నటించి తండ్రి ఎన్టీయార్ కి పోటీగా నటనలో మంచి మార్కులు సంపాదించుకున్నారు. ఆ సినిమాలో నటనలో ఘనాపాఠి  అయిన  భానుమతి వంటి సీనియర్ నటీమణులు ఉన్నా వారితోనే కలసి బాలయ్య నటించి శభాష్ అనిపించుకున్నారు.

 

ఆ తరువాత ఆయన కళాశాలలో చదువుతూ కూడా సినిమాల్లో నటించారు. సోలో హీరోగా వచ్చేనాటికే ఆయన డజన్ కి పైగా సినిమాలు చేసి కంప్లీట్ సినీ మెటీరియల్ తాను అనిపించుకున్నారు. ఇక ఇప్పటికి వందకు పైగా సినిమాలు చేసినా బాలయ్యలో ఇంకా తపన ఉంది. తనకు కొత్త పాత్ర రావాలి. తాను అందులో పరకాయ ప్రవేశం చేయాలి. అలా వినూత్నంగా ఆలోచించే బాలయ్యకు మంచి పాత్రతో జత చేరాడు బోయపాటి

 

బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న మూవీ పట్ల ఇటు ఫ్యాన్స్ తో పాటు, అటు ఇండస్ట్రీలోనూ బాగా హైప్ ఉంది. ఈ మూవీలో బాలయ్య అఘోరాగా కనిపిస్తారట. కాశీలోని గంగాతీరం లో సంచరించే అఘోరాగా బాలయ్య నటిస్తారని బోయపాటి నెవ్స్ రివీల్ చేశాడు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

 

ఇక ఈ పాత్ర కోసం బాలయ్య అపుడే తనదైన ట్రైనింగ్ తీసుకుంటున్నారుట. ఆయన అఘోరాలు ఎలా సంచరిస్తారు. వారి భాష, నడక, తీరు ఎలా ఉంటుంది అన్నవి పూర్తిగా ఔపాసన చేసుకునే పనిలో ఉన్నారట. ఓ విధంగా అఘోరాగా బాలయ్య జీవిస్తాడని అంటున్నారు. బాలయ్య  జీవితంలో ఇచి గుర్తుండిపోయే పాత్ర అవుతుందని, అంతే కాదు, టాలీవుడ్లో కూడా అరుదైన పాత్రలలో ఒకటిగా ఇది ఉంటుందని అంటున్నారు.

 

మొత్తం మీద చూసుకుంటే బాలయ్యకు నటన ఆకలి ఎక్కువ. దాన్ని పూర్తిగా తీర్చేసేలా బోయపాటి ఈ పాత్రను డిజైన్ చేశారని టాక్. ఈ సినిమాలో  ఇంటర్వెల్ తరువాత అఘోరా పాత్రలో బాలయ్య ఎంట్రీ అదుర్స్ అన్నట్లుగా ఉంటుందిట. లాక్ డౌన్ అయ్యాక ఈ సినిమా షూటింగ్ ప్రారభిస్తారని అంటున్నారు. చూడాలి మరి. ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: