టాలీవుడ్ యువ స్టార్ నటులైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా కలిసి తొలిసారిగా నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం. ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ హిస్టారికల్ మూవీ ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని, కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ ఇప్పటికే ఎనభై శాతానికి పైగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా, గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పెండింగ్ ఉన్న కారణంగా వచ్చే ఏడాది జనవరి 8 కి వాయిదా పడింది. 

 

అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ వలన మన దేశాన్ని కూడా లాక్ డౌన్ చేయడంతో కొన్నాళ్లుగా సినిమా షూటింగ్స్ అన్ని కూడా బంద్ అయ్యాయి. దానితో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా ఆగిపోవడంతో సినిమాకు సంబంధించి చాలా వర్క్ పెండింగ్ ఉన్నట్లు చెప్తున్నారు. కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా మరొక్కసారి వాయిదా పడి, వచ్చే ఏడాది సమ్మర్ కి వెళ్లినా వెళ్లొచ్చనే వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. అయితే ఆ విషయాలు అటుంచితే, గతంలో రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాలు ఒకదానిని మించి మరొకటి ఎంతో గొప్ప అద్భుత విజయాలు అందుకోవడంతో అందులో నటించిన నటీనటులకు కూడా గొప్ప పేరు వచ్చింది. ముఖ్యంగా హీరో ప్రభాస్ కు అయితే ఆ రెండు సినిమాల తరువాత మన దేశంతో పాటు విదేశాల్లో కూడా విపరీతమైన పేరు ప్రఖ్యాతలు దక్కాయి. 

 

ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ కూడా మంచి హిట్ కొట్టినట్లైతే అటు ఎన్టీఆర్ తో పాటు ఇటు రామ్ చరణ్ క్రేజ్ కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు చేరుకోవడం ఖాయం అని అంటున్నారు. అయితే బాహుబలి రెండు సినిమాల తరువాత ఆ రేంజ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ఉంటుందా అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నప్పటికీ, అక్కడ దర్శకత్వం వహిస్తోంది రాజమౌళి అని, సినిమాలోని ప్రతి ఒక్క సీన్ ని ఎంతో నిశితంగా పరిశీలించి తీసే రాజమౌళి, తప్పకుండా ఆర్ఆర్ఆర్ ని అతి పెద్ద విజయవంతం చేసి తమ హీరోలకు భారీ మార్కెట్, ఇమేజ్ ని తెచ్చిపెట్టడం ఖాయం అంటున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్. మరి వార్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో తెలియాలంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.....!!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: