దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ "రౌద్రం రణం రుధిరం". టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫిషన్ బ్యాగ్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో తారక్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, సీనియర్ హీరో అజయ్ దేవ్ గన్ లతో పాటు విదేశీ నటీనటులు రే స్టీవెన్‌ సన్‌ ను, ఐరిష్ నటి అలిసన్ డూడీ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

 

ఇక లాక్ డౌన్ లో రాజమౌళి ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఆర్.ఆర్.ఆర్ గురించి కీలక విషయాలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ప్రస్తుతానికి ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానన్నారు. ముందు ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉందో తెలుసుకోవాలి. లాక్ డౌన్ వల్ల వాళ్ళు వరల్డ్ సినిమాని చూశారు. మరి లాక్ డౌన్ తర్వాత వాళ్ళు మన సినిమాలను ఎలా ఆదరిస్తారో చూడాలి అని వెల్లడించారు. ఇక ఆర్.ఆర్.ఆర్ ను 2021 జనవరి 8 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా నుండి ఎన్.టి.ఆర్ బర్త్ డే సందర్భంగా భీం పాత్రని రివీల్ చేయనున్నారని తెలుస్తుంది. 

 

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక భారీ సినిమాని రూపొందించనున్నారు. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్.నారాయణ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు పరశురాం తో సినిమా చేయబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజైన మే 31 న ఈ సినిమా నుంచి అధికారక ప్రకటన రాబోతుందని సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: