మహానటి సావిత్రి.. ఇద్దరు తల్లుల ప్రేమతో గారాభంగా పెరిగింది.. ఎంతో ఆనందంగా ఆడుతూ పాడుతూ బాల్యాన్ని సంతోషంగా గడిపింది.. సినిమాల్లోకి వెళ్ళింది.. కోట్లు సంపాదించింది.. ప్రేమించింది.. పెళ్లి చేసుకుంది.. భర్తతో అంతా బాగుంది అనుకున్న సమయంలో ఆమె విజయాన్ని జీర్ణించుకోలేక పోయాడు ఆ భర్త.. 


 
ఆ తరువాత సావిత్రి నిర్మాత అయ్యింది.. ఆమెకు తెలీకుండానే ఆమె ఆస్తులు కరిగిపోయాయి.. ఆమె భర్త తాగుబోతు అయ్యాడు.. అమ్మాయిలకు దగ్గర అయ్యాడు.. అది చూసి ఆమె భరించలేకపోయింది.. మద్యానికి బానిస అయ్యింది. భర్త దూరం అయ్యాడు.. ఆస్తులు లేవు.. మహానటి కాస్త ఒంటరి మహిళ అయ్యింది..                  


 
కానీ.. సావిత్రి ఒంటరి అయినప్పటికీ ఇద్దరు పిల్లలకు అందించాల్సిన ప్రేమ అందించింది.. తన జీవితం నాశనం అయినా కూతురు జీవితం బాగుండాలి అనుకుంది.. అందుకే ఆమెకు ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపింది.. చివరికి తల్లి ఒంటరి అయినా కూతురు జీవితం ఆనందంగా సాగిపోయేలా చేసింది.. ఇంకా ఉన్నది ఒక్క కొడుకు.  


 
ఆ కొడుకు కోసం రాత్రనక.. పగలనక.. సినిమాలలో నటించి పిల్లాడిని ఓ రేంజ్ లో చూడాలి అనుకుంది.. ఆ పిల్లాడి కోసం ఆస్తులు సంపాదిస్తుంది.. కానీ ఆ సమయంలోనే మళ్లీ ఆమె ఆస్తులు కరిగిపోతున్నాయని తెలిసింది.. ఎక్కువ సినిమాల్లో నటించడానికి ప్రయత్నించింది.. కానీ అంత వత్తిడి భరించలేకపోయింది.. చివరికి తన పిల్లాడి కోసమే ఆమె జీవితం ముగిసిపోయింది.. అందాల మహానటి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. మహానటి ఒక తల్లిగా తన పిల్లల భవిష్యత్తు కోసం చేసిన త్యాగాలు అన్నీఇన్నీ కాదు.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: