తెలుగు ఇండస్ట్రీలో ఒక్క సినిమా హిట్ అయితే .. మళ్లీ ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే.. కానీ బుల్లి తెరపై కనిపించే షో లలో మాత్రం యాంకర్లు రోజు రోజుకు ఫేమస్ అవుతున్నారు..అందుకే ప్రస్తుతం యాంకర్ల హవా నడుస్తుంది..సినిమాలను మించిన విధంగా పేరు రావడంతో యాంకర్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు..

 

 

 

 

 

బుల్లి తెరపై యాంకర్లు గా చాలా మందే ఉంటారు కానీ వారిలో కొంతమందికే మంచి టాక్ ఉంటుంది. తెలుగు యాంకర్లు అంటే ముఖ్యంగా వినిపించే పేరు లెజండరీ పర్సన్ సుమ.. ఆ తర్వాత వినిపించే పేరు ఝాన్సీ, ఉదయ భాను, తదితరులు.. కానీ ఈ మధ్య కాలంలో  ఒక్క సుమ తప్ప మిగిలిన వారి పేర్లు కనుమరుగైనాయ్యి.. ఇప్పుడు  కొత్త యాంకర్ల హవా నడుస్తుంది. 

 

 

 

ప్రస్తుతం తెలుగు టెలివిజన్ లో ప్రసారమవుతున్న షో లలో హవాను కొనసాగిస్తోంది అంటే వెంటనే గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ,తర్వాత వినిపించే పేర్లు అంటే అనసూయ, రష్మి , శ్రీముఖి .. మెల్ యాంకర్ల విషయానికొస్తే.. ప్రదీప్ , రవి .. ఈ ఇద్దరు అడపాడపా షో లను చేస్తూ కాంట్రవర్సీ లతో బాగానే పాపులర్ అవుతున్నారు.. 

 

 

 

 

 

యాంకర్ రవి .. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆయన యాంకరింగ్ కన్నా కూడా ఆయనపై సోషల్ మీడియా లో వచ్చే రూమర్లు వల్ల చాలా ఫేమస్ అయ్యాడు.. ఇంక చెప్పాలంటే తన దురుసు వల్ల యూట్యూబ్ లో ఫేమస్ అయ్యాడు .. అయితే రవి వాళ్ళ అమ్మ ఉమ అంటే చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో వెల్లడించారు.. తనకు అన్నీ నేర్పించిన అమ్మ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ రవి అన్నారు.. నిజంగానే అమ్మను పది మంది ముందు ప్రేమను చూపిస్తే ఆమె ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి.. హ్యాపీ మదర్స్ డే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: