ఈ లోకంలో అందరికి కనిపించే దైవం అంటే అది కేవలం అమ్మ... గుడి లేని దేవత.. జన్మను ఇచ్చేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టిన మాతృ మూర్తి.. అందుకే అమ్మను కనిపించే దైవం అంటారు..తన రక్త మాంసాలని దారపొస్తే కలసినదే ఈ శరీరం .. బిడ్డ కడపున పడిన తొలి నెల నుంచే బిడ్డకు ప్రపంచాన్ని చూపిస్తుంది.. ఒక్కో నెల పెరుగుతున్న కొద్ది భారం అవుతుంది అని ఏ తల్లి అనుకోదు.. బిడ్డకు నేను భారం కలిగించ కూడదని తల్లడిల్లి పోతుంది.. నెలలు నిండి ప్రసవానికి వెళితే బిడ్డ బయటకు వచ్చే వరకు ఎన్నో బాధలను .. ఇంకా చెప్పాలంటే 32 ఎముకలు విరిగితే ఎంత నొప్పి వస్తుందో అంతా నొప్పిని భరించి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది..

 

 

 

 

 

 

ఒక్కో అడుగు మనం వేస్తుంటే మురిసి పోతుంది.. చదువు కొనే వయసుకు మన వెన్నంటి ఉండి .. విద్య బుద్దులు నేర్పిస్తుంది.. పెళ్లి చేసుకొని వెళ్ళాక కన్నీటిని దిగమింగుకుని నా బిడ్డ సంతోషంగా ఉంటె చాలు అని ఆలోచిస్తుంది.. అందుకే భయ్య అమ్మకు పిరికెడు అన్నాన్ని పెట్టండి.. పరమానంలా భావించి బిడ్డ ఎదుగుదల చూసి మురిసి పోతుంది.. అలాంటి అమ్మను వృద్దాప్యం రాగానే స్పెషల్ కేరింగ్ అంటూ దూరం చేయకండి.. ముసలి ప్రాణం తట్టుకోలేదు.. డబ్బులో కాదు .. అమ్మ అన్న ఆప్యాయతతో దగ్గరకు తీసుకోండి.. అప్పుడే అమ్మా మన కళ్ళకు దేవత అవుతుంది.. 

 

 

 

 

 

 

పేద వాడికైనా ధనవంతులకు అయిన కూడా అమ్మ ప్రేమ ఒకటే .. డబ్బులకు వెలకట్టలేనిది అమ్మ ప్రేమ.. అసలు విషయానికొస్తే.. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు అమ్మ మాటకు విలువిస్తారు.. పూజిస్తారు.. మెగాస్టార్ చిరంజీవి అందరికన్నా ఎక్కువగా ఆలోచిస్తాడు.. అమ్మ అంజనమ్మను కోతురులాగా చూసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే.. అమ్మ అనుమతి లేకుండా ఏ పాని చేయడన్న సంగతి తెలిసిందే.. అందుకే అమ్మ బిడ్డ అని చిరంజీవిని చాలామంది అన్న సందర్బాలు లేక పోలేదు ... హ్యాపీ మదర్స్ డే .. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: