అదృష్టం తోడు ఉంటే ఎంతటి ఉపద్రవం నుంచైనా తప్పించుకోవచ్చని నిరూపిస్తోంది ‘రెడ్’ సినిమా టీమ్. రామ్ హీరోగా తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మిస్మున్న ఈ సినిమా గత ఫిబ్రవరిలో ఇటలీలో రెండు పాటల చిత్రీకరణ జరిపారు. ఆ సమయంలో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఇటలీలోని పరిస్థితులు కరోనా దెబ్బకు తర్వాత ఎలా మారిపోయాయో తెలిసిన విషయమే. ఇవే అనుభవాల్ని నిర్మాత రవికిశోర్ పంచుకున్నారు. కేవలం వారం రోజుల్లో ఎలాంటి విపత్కర పరిస్థితుల నుంచి తప్పించుకున్నారో వివరించారు.

 

 

‘ఇటలీలోని డోలమైట్స్ పర్వత తీర ప్రాంతంలో హాలీవుడ్ సినిమాలు తప్ప తెలుగు సినిమాల షూటింగ్స్ ఇంతవరకూ జరగలేదు. అక్కడ షూటింగ్ చేద్దామన్న దర్శకుడు కిశోర్ తిరుమల నిర్ణయంతో అక్కడకు వెళ్లాం. సినిమాలోని రెండు పాటల షూటింగ్ కు టీమ్ తో ఇటలీ వెళ్లాం. టుస్కాన్, ఫ్రారెన్స్, డోలమైట్స్ ప్రాంతాలతో పాటు లేక్ గార్డాలో కూడా మొత్తంగా రెండు పాటలు షూటింగ్ చేశాం. గార్డా లేక్ కు బెర్గామో ప్రాంతానికి గంట ప్రయాణం. బెర్గామో అంటే ప్రస్తుతం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా అక్కడ విలయం సృష్టించింది. పైగా మేము 15న గార్డాలో, 16న డోలమైట్స్ లో పాటలు చిత్రీకరించాం. అక్కడి నుంచి మేము వచ్చిన ఆరు రోజులకు 22 మందితో అక్కడికి వెళ్లిన బ్రిటిష్ స్కై టీమ్ లోని 17మందికి కరోనా వచ్చిందని తెలిసేసరికి మాకు వణుకు పుట్టించింది.’ అని చెప్పుకొచ్చారు.

 

 

అక్కడ షూటింగ్ చేసిన శోభి మాస్టర్, టీమ్ మేమంతా ఇదే ఆలోచిస్తున్నాం. ఎంత అదృష్టవంతులం కాకపోతే వారం రోజుల తేడాలో ఆ ఉపద్రవం బారిన పడకుండా ఉండగలిగాం. ఈ ఆలోచనతో సంతోషం అనిపిస్తున్నా భారత్ లో ఆ మహమ్మారి విలయతాండవం కలవరపెడుతోంది. అందరూ జాగ్రత్తలు పాటిస్తూ, ఇళ్లలోనే ఉండాలి అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: