ఈరోజుల్లో లాంటి సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. బస్టాప్ వంటి సినిమా చేసిన మారుతి ఆడియెన్స్ తనని అడల్ట్ డైరక్టర్ అనే ముద్ర వేశారని గుర్తించి చిన్నగా కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ వచ్చాడు.  కామెడీ, ఫ్యామిలీ సినిమాలు చేస్తూ వస్తున్నా మారుతి తన సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనేలా చేసుకున్నాడు. అంతేకాదు భలే భలే మగాడివోయ్ సినిమాతో నానికి స్టార్ ఇమేజ్ వచ్చేలా చేశాడు మారుతి. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో సాయి తేజ్ తో చిత్రలహరి సినిమా కూడా చేశాడు మారుతి. 


ఇక ఈ లాక్ డౌన్ టైం లో మారుతి ఇప్పటికే ఒక కథ సిద్ధం చేశాడని ప్రకటించగా రెండో కథ కూడా సిద్ధం చేస్తున్నాడట. మొదటి కథ ఎవరికో తెలియదు కానీ రీసెంట్ గా స్టార్ చేసిన సెకండ్ స్టోరీ మాత్రం నాచురల్ స్టార్ నాని కోసమని తెలుస్తుంది. నాని హీరోగా వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో ఆడియెన్స్ ను కబుపుబ్బా నవ్వించిన మారుతి ఈసారి కూడా కొత్త కాన్సెప్ట్ తో నాని మూవీ చేస్తాడని అంటున్నారు. నానితో మారుతి మూవీ పక్కా హిట్ అంటూ ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. 


అంతేకాదు వీళ్లిద్దరి కలయికలో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంటున్నారు. మారుతి కాన్సెంట్రేట్ చేశాడు అంటే సినిమా పక్కా టార్గెట్ రీచ్ అయినట్టే లెక్క. నాని ప్రస్తుతం శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీశ్, రాహుల్ సాంకృత్యన్ డైరక్షన్ లో శ్యామ్ సింగ్ రాయ్. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే మారుతి డైరక్షన్ లో సినిమా చేస్తాడని చెప్పొచ్చు. అంతేకాదు నాని వి సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సినిమా రిలీజ్ ఎప్పుడు చేస్తారో తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: