బాలీవుడ్ సొంతంగా ఆలోచించలేకపోతోందో.. లేక కష్టపడటం ఎందుకు అనుకుంటుందో తెలియదు గానీ.. ముంబయి స్టార్లు అంతా రీమేకుల్లో మునిగిపోతున్నారు. ఎక్కడ హిట్ స్టోరీ ఉంటే అక్కడ వాలిపోయి.. ఆ సినిమాలను ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. 

 

అమీర్ ఖాన్ ఎక్స్ పెరిమెంటల్ క్యారెక్టర్స్ చేసేందుకు తెగ ట్రై చేస్తుంటారు. కొత్తకొత్త కథాంశాలను వెతికి మరీ పెట్టుకుంటాడు. అయితే ప్రయోగాలు చేసేందుకు తపించే ఈ హీరో ఇప్పడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అమెరికాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఫారెస్ట్ గంప్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. లాల్ సింగ్ చద్దా టైటిల్ తో అమెరికన్ స్టోరీని హిందీలో చూపించబోతున్నాడు అమీర్. 

 

రెగ్యులర్ స్టోరీస్ ను పక్కన పెట్టి, వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తున్న హీరో అక్షయ్ కుమార్. సినిమా సినిమాకో జానర్ ను టచ్ చేస్తున్న ఈ హీరో ఇప్పుడు కాంచన రీమేక్ లో నటిస్తున్నాడు. లక్ష్మీబాంబ్ పేరుతో తెరకెక్కుతోంది ఈ సినిమా. కాంచన సిరీస్ తో తెలుగు, తమిళ జనాలను భయపెట్టిన లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోంది లక్ష్మీబాంబ్. 

 

రొమాంటిక్ స్టోరీస్ తో స్టార్ రేసులో పరుగులు పెడుతోన్న హీరో కార్తీక్ ఆర్యన్. లవర్ బాయ్ గా విపరీతమైన లేడీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ స్టార్ అల వైకుంఠపురములో అడుగుపెట్టబోతున్నాడు. రాములో రాములా అంటూ స్టెప్పులెయ్యబోతున్నాడు. అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమాను రీమేక్ చేయబోతున్నాడు కార్తీక్ ఆర్యన్. 

 

కథలు మనదగ్గరకు రాకపోతే మనమే కథల దగ్గరకు వెళ్లాలి. టోల్ గేట్లు, రాష్ట్రాల సరిహద్దులు దాటుకుంటూ స్టోరీ సెర్చింగ్ చేయాలి. అంతకీ దొరక్కపోతే విదేశాలను టచ్ చేయాలి. అప్పుడు ఏదో ఒక సూపర్ హిట్ సినిమా దొరుకుతుంది. దాన్ని రీమేక్ చేసుకోవచ్చనే ఆలోచనల్లో ఉన్నారు బాలీవుడ్ జనాలు. 

 

షాహీద్ కపూర్ రీమేక్ కింగ్ గా మారిపోతున్నాడు. అర్జున్ రెడ్డిని కభీర్ సింగ్ గా రీమేక్ చేసి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు షాహిద్. ఈ మూవీతోనే బిలియన్ క్లబ్ లో జాయిన్ అయ్యాడీ హీరో. ఇక ఈ సక్సెస్ ను రిపీట్ చేసేందుకు రీమేక్స్ నే కంటిన్యూ చేస్తున్నాడు షాహిద్. నాని కెరీర్ లో ఎమోషనల్ గా హిట్ గా నిలిచిన జెర్సీని సేమ్ టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు షాహిద్. 

మరింత సమాచారం తెలుసుకోండి: