ఈ లోకంలో అందరికి కనిపించే దైవం అంటే అది కేవలం అమ్మ... గుడి లేని దేవత.. జన్మను ఇచ్చేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టిన మాతృ మూర్తి.. అందుకే అమ్మను కనిపించే దైవం అంటారు..తన రక్త మాంసాలని దారపొస్తే కలసినదే ఈ శరీరం .. బిడ్డ కడపున పడిన తొలి నెల నుంచే బిడ్డకు ప్రపంచాన్ని చూపిస్తుంది.. ఒక్కో నెల పెరుగుతున్న కొద్ది భారం అవుతుంది అని ఏ తల్లి అనుకోదు.. బిడ్డకు నేను భారం కలిగించ కూడదని తల్లడిల్లి పోతుంది.. నెలలు నిండి ప్రసవానికి వెళితే బిడ్డ బయటకు వచ్చే వరకు ఎన్నో బాధలను .. ఇంకా చెప్పాలంటే 32 ఎముకలు విరిగితే ఎంత నొప్పి వస్తుందో అంతా నొప్పిని భరించి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది..

 

 

 

 

ఒక్కో అడుగు మనం వేస్తుంటే మురిసి పోతుంది.. చదువు కొనే వయసుకు మన వెన్నంటి ఉండి .. విద్య బుద్దులు నేర్పిస్తుంది.. పెళ్లి చేసుకొని వెళ్ళాక కన్నీటిని దిగమింగుకుని నా బిడ్డ సంతోషంగా ఉంటె చాలు అని ఆలోచిస్తుంది.. అందుకే భయ్య అమ్మకు పిరికెడు అన్నాన్ని పెట్టండి.. పరమానంలా భావించి బిడ్డ ఎదుగుదల చూసి మురిసి పోతుంది.. అలాంటి అమ్మను వృద్దాప్యం రాగానే స్పెషల్ కేరింగ్ అంటూ దూరం చేయకండి.. ముసలి ప్రాణం తట్టుకోలేదు.. డబ్బులో కాదు .. అమ్మ అన్న ఆప్యాయతతో దగ్గరకు తీసుకోండి.. అప్పుడే అమ్మా మన కళ్ళకు దేవత అవుతుంది.. 

 

 

 

మదర్స్ డే నీ  పురస్కరించుకొని సినీ తారలు ప్రత్యేకంగా అందరికీ విషెస్ తెలుపుతున్నారు.. ఈ మేరకు సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనకు అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలిపింది..తనకు చిన్నతనం నుంచే అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తూ ఈ రోజు హీరోయిన్ చేసింది అమ్మే అని పేర్కొంది. క్లాస్‌ ఫస్ట్‌ రాకపోయినా ఫర్వాలేదు కానీ అన్నింట్లోనూ కొంత ప్రావీణ్యం ఉండాలని అమ్మ చెప్పేదని తెలిపింది. తనకు మూడేళ్ల వయసప్పుడే తనను హీరోయిన్‌గా చూడాలని ఆ దిశగా అమ్మనే గైడ్ చేస్తూ ఈ రోజు ఈ స్థాయిలో ఉంచిందని ఆమె చెప్పింది. స్విమ్మింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌, కరాటే లాంటి వాటిలో కూడా అమ్మ కారణంగానే శిక్షణ పొందానని రకుల్ చెప్పుకొచ్చింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: