వెండి తెరపై తిరుగులేని హీరోగా రాణించిన మెగాస్టార్ చిరంజీవి దాదాపు కొన్ని దశాబ్దాలు పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనాన్ని అధిరోహించాడు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోగా మెగాస్టార్ నిలిచిపోయారు. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తూ చిరంజీవి రాణించడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి పెద్దగా రాణించలేకపోయారు. మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు తిరిగి సినిమాలు చేస్తూ ప్రస్తుతం రాణిస్తున్నారు. 65 వయసు కలిగిన చిరంజీవి సోలో హీరోగా సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నారు. ఏమాత్రం కుర్ర హీరోలకు తీసుపోకుండా ఫైట్ లు మరియు డాన్స్ అదే రీతిలో అప్పట్లో అలరించిన మాదిరిగానే ఇప్పుడు చేస్తున్నారు.

 

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. కాగా టెక్నాలజీ రావటం మరోపక్క టాలెంట్ కూడా ఉన్న కొద్ది పెరగటంతో చిరంజీవి చేస్తున్న నటనకు అదేవిధంగా ఆయన వయసు ఆరు పదులు దాటినా తరువాత కూడా రొమాన్స్ చేయడంతో కొన్ని విమర్శలు ఇటీవల వస్తున్నాయి. దీంతో చిరంజీవి తన సినిమాల ఎంపికలో నిర్ణయాన్ని మార్చుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. ఖైదీ నెం.150 చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన చిరంజీవి త్వరలోనే సరికొత్త ప్రయోగం చేయనున్నారని ఇండస్ట్రీ నుండి వార్తలు వస్తున్నాయి.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోల ఫంక్షన్లకు ఇటీవల గెస్ట్ గా వస్తూ వారి టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న చిరంజీవి... ఇకనుండి కుర్ర హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందుగా హీరో రాణాతో సినిమా చేయనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తరతరాలకు అందరికీ ఆదర్శంగా నిలిచిపోయే విధంగా మెగాస్టార్ ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎవరి సపోర్టు లేకుండా పైకొచ్చిన తాను తనలాగా...ఇండస్ట్రీలో కష్టపడుతున్న హీరోలకు అండగా ఉండటానికి చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: