మాస్ రాజా రవితేజ ఎటూ తేల్చుకోలేక.. మళ్లీ స్పీడ్ పెంచాడు. వరుస ఫ్లాపులు రావడంతో.. గ్యాప్ తీసుకున్నాడు. ఆచితూచి అడుగు వేయాలనుకున్నాడు. ఈ క్రమంలో అన్ని జాగ్రత్తలు పాటించి ఏడాది విరామం తర్వాత వస్తే.. డిస్కో రాజా ఫ్లాప్ అయింది. దీంతో రియలైజ్ అయిన మాస్ రాజా.. ఏదైతే అది అయిందంటూ.. స్పీడ్ పెంచి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం నటిస్తున్న క్రాక్ కాకుండా.. మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు ఈ సీనియర్ హీరో. 

 

రవితేజకు సెంటిమెంట్స్ తక్కువే. కలిసిరాని హీరోయిన్స్ తో మళ్లీమళ్లీ జత కడతాడు. అలాగే.. ఫ్లాపులతో ఉన్న దర్శకులను పిలిచి మరీ ఛాన్సులిస్తాడు మాస్ రాజా. ఫ్లాప్ డైరెక్టర్స్ పట్ల మాస్ రాజాకు సానుభూతి కాస్త ఎక్కువే. రవితేజ సినిమాల లిస్ట్ చూస్తుంటే.. ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకే ఛాన్సులిచ్చాడు. శ్రీనువైట్లతో ఇది మొదలైంది. వెంకీ.. దుబాయ్ శీను లాంటి హిట్స్ ఇచ్చాడన్న నమ్మకంతో శ్రీనువైట్ల వరుస ఫ్లాపుల్లో ఉన్నా.. అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ ఇచ్చాడు. 

 

అదేమిటో గానీ.. మాస్ రాజా ఫ్లాప్ డైరెక్టర్స్ నే ఎంచుకుంటున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా హిట్ తర్వాత విఐ ఆనంద్ తీసిన ఒక్క క్షణం ఫ్లాప్ అయింది. అయితే డైరెక్టర్ టేకింగ్ ఇచ్చి.. డిస్కో రాజా ఛాన్స్ ఇచ్చాడు. అలాగే.. విన్నర్ డిజప్పాయింట్ ఉన్న గోపీచంద్ మలినేనితో క్రాక్ మూవీ చేస్తున్నాడు రవితేజ. గోపీచంద్ గతంలో రవితేజాతో డాన్ శ్రీను.. బలుపు తీసి మెప్పించాడు. ఈ క్రమంలో హ్యాట్రిక్ ప్లాన్ చేశాడు రవితేజ. 

 

మరో ఫ్లాప్ డైరెక్టర్ వక్కంతం వంశీ రవితేజ ఆశీస్సులు అందుకున్నాడు. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాతో వక్కంతం దర్శకుడిగా పరిచయమయ్యాడు. డెబ్యూ మూవీ ఫ్లాప్ కావడంతో.. రెండేళ్లయినా.. మరో ఛాన్స్ దక్కలేదు. రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన కిక్ కు కథ అందించిన వక్కంతంకు ఆఫర్ ఇచ్చాడని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: