ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు అన్నీ కూడా ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలను ఫోకస్ చేసాయి అనేది వాస్తవం. అక్కడ మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో మన హీరోలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలను చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్ర హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా సినిమా చెయ్యాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క అవకాశం కోసం నానా కష్టాలు పడుతున్నారు మన హీరోలు. 

 

అగ్ర హీరోలు అయితే తీవ్రంగా పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటే దర్శకులు కూడా వారికి సహకారం అందిస్తున్నారు. ఇన్నాళ్ళు పాన్ ఇండియా సినిమా మీద పెద్దగా దృష్టి పెట్టలేని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఎన్టీఆర్ సహకారం తో ఆ విధంగా అడుగులు వెయ్యాలి అని ప్రయత్నాలను ఎక్కువగా చేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. పాన్ ఇండియా సినిమా కోసం గానూ ఎన్టీఆర్ సహకారం తీసుకోవాలి అనేది త్రివిక్రమ్ భావన. ఎన్టీఆర్ తో చేసే సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తీసుకుని వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. 

 

అలాగే నానీ తో చెయ్యాలి అనుకునే సినిమాను కూడా పాన్ ఇండియా సినిమా గా తీసుకుని వచ్చే ప్రయత్నాలను త్రివిక్రమ్ చేస్తున్నాడు అని అంటున్నారు. అందుకే బాలీవుడ్ నటులను తన సినిమాలో తీసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అక్కడి అగ్ర దర్శకుల తో అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే దాన్ని వాడుకుని ఇప్పుడు అతను ప్రభావం చూపించాలి అని ప్రయత్నాలు చేస్తూ నానా కష్టాలు పడుతున్నాడు. మరి అది ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ఆలోచన లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: