మెగాస్టార్ 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తునన్ సంగతి విధితమే. ఈ మూవీ కొంత షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ లోగా క‌రోనా రావడం, దేశంలో లాక్ డౌన్ విధించడం తో షూటింగ్ ఆగింది. మళ్ళీ లాక్ డౌన్ తరువాత షూటింగ్ మొదలుపెడతారు అంటున్నారు.

 

ఈ లోగా ఈ మూవీ బెటర్మెంట్ కోసం శివ చేయాల్సిన కసరత్తు చేస్తున్నాడు. మరో వైపు చూస్తే ఈ మూవీ మీద మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. 150 మూవీగా వచ్చిన ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్ అయింది. ఆ తరువాత 151 సినిమాగా వచ్చిన సైరా మూవీ భారీ బడ్జెట్ తో తీసినా కూడా ఆశించిన విజయం పొందలేదు. దాంతో మెగా ఆకలి తీరలేదు.

 

ఇపుడు శివ హిట్లు వరసగా ఇచ్చి ఉన్న డైరెక్టర్. ఆయన డైరెక్షన్లో మూవీ అంటేనే అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి తగినట్లుగా మంచి కధతోనే శివ కూడా వచ్చాడు. ఇపుడు అంతా ఒకే అనుకున్న వేళ కరోనా వల్ల పెద్ద బ్రేక్ పడిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్ ని చూసినపుడు ఆచార్య ఎపుడు పూర్తి అవుతుంది. ఎపుడు రిలీజ్ అవుతుంది అన్నది కూడా ప్రశ్నగా ఉంది. 

 

ఎందుకంటే మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ మూవీకి దీనికి లింక్ ఉంది. అది సంక్రాంతికి వస్తే ఆచార్య సమ్మర్  కి వెళ్తుంది. ఇక సమ్మర్ కి ఆర్.ఆర్.ఆర్ అనుకుంటే మాత్రం ఆచార్యకు మంచి టైం దొరికినట్లే. ఏది ఏమైనా రానున్న నెలల్లో ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా సినిమాను పట్టాలెక్కించాలి

 

సినిమా బంపర్ హిట్ అయితేనే మెగాస్టార్ తరువాత మూవీ మీద కూడా ఆశలు, అంచనాలు ఉంటాయని అంటున్నారు. చిరంజీవి కూడా ఆచార్య మీదనే పూర్తి ద్రుష్టి పెట్టారని అంటున్నారు. సీనియర్ హీరోగా 65 ఏళ్ళ వయసు ఉన్న చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం మరింతగా వెలిగిపోవాలంటే ఆచార్య చేతిలోనే అంతా ఉందని అంటున్నారు. అంటే శివ సక్సెస్ ఫుల్ గా బొమ్మ తీయాలన్నమాట. ఇప్పటికే వివిధ రకాలైన కారణాలతో వత్తిడి మీద ఉన్న శివకు ఇపుడు ఆచార్య పెద్ద ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ గా ఉందని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: