టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం మన దేశంలో కొన్నాళ్లుగా లాక్ డౌన్ అమలవుతుండడంతో తన ఫ్యామిలీ తో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఇక ఇటీవల సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో కెరీర్ పరంగా వరుసగా మూడవ విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్, ఇప్పటికే తన తదుపరి సినిమాకు సంబంధించి పూర్తి గా రెడీ అవుతున్నారు. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం రోజైన ఈ నెల 31న ముహూర్తం జరుపుకోబోతున్నట్లు టాక్. 

 

ప్రతి ఏడాది తన తండ్రి జన్మదినం రోజున తన సినిమాకు సంబంధించి ఓపెనింగ్, టీజర్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్, ఫస్ట్ లుక్ రిలీజ్ వంటివి రిలీజ్ చేసే అలవాటున్న మహేష్, ఈ ఏడాది కూడా తన కొత్త సినిమా ప్రారంభోత్సవాన్ని నిర్వహించడానికి సిద్ధం అయ్యారట. ఇకపోతే ఆ సినిమాని మహేష్, కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నట్లు చెప్తున్నారు. ఇక ఎప్పుడూ సినిమాలతో పాటు ఎక్కువగా తన కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చి తనకు ఖాళి సమయం దొరికినపుడు వారితో సరదాగా గడిపే అలవాటున్న సూపర్ స్టార్, తన గ్లామర్ రహస్యం గురించి ఎవరైనా అడిగితే ఒక మాట చెప్తుంటారు. ఎప్పుడూ మన కుటుంబంలోని వారందరితో మనం హాయిగా గడుపుతూ, సమయానికి నిద్ర, భోజనం వంటివి తీసుకుంటూ మనసు, తనువును ప్రశాంతంగా ఉంచుకుంటే చాలు మన ముఖం ఎప్పుడూ అందంగా కనపడుతుందని, అదే తన గ్లామర్ సీక్రెట్ అని మహేష్ తరచూ చెప్తూ ఉంటారు. 

 

తాను ఎప్పుడూ షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉండడంతో పిల్లలతో పాటు ఇంటి బాధ్యతను నమ్రత చూసుకుంటారని, ఎవరికీ ఎటువంటి సమస్య రాకుండా ఆమె వ్యవహరిస్తారు కాబట్టే తనకు షూటింగ్స్ నుండి ఇంటికి రాగానే ఎంతో హాయిగా ఉంటుందని, ఆ విధంగా మనల్ని అర్ధం చేసుకుని నడుచుకునే భార్య దొరికితే జీవితం ప్రశాంతంగా ఉంటుందని కూడా ఆయన చెప్తుంటారు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కొన్ని తన పిల్లల, అలానే తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్న మహేష్ ని చూస్తుంటే మరింత యంగ్ గా కనపడుతుండడంతో, అసలు మీకు వయసు పెరుగుతోందో, లేక తగ్గుతోందో అర్ధం కావడం లేదని పలువురు అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆయన పై సరదగా కామెంట్స్ చేస్తున్నారు.....!!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: