నట సింహం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకే కాదు ప్రేక్షకులకి విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. బాలయ్యని ముందు సింహ గా చూపించిన బోయపాటి అద్భుతమైన సక్సస్ ని ఇచ్చారు. అంతకముందు బాలయ్య కి కాస్త సక్సస్ లు వచ్చి చాలా రోజులైంది. దాంతో ఈ సినిమా బాలయ్యకి మంచి కంబ్యాక్ లా అయిపోయింది. ఇందులో బాలయ్య పోషించిన రెండు పాత్రలు..ఆ రెండు పాత్రలను బోయపాటి వెండి తెరమీద ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

 

దాంతో మళ్ళీ ఇదే కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ మరో భారీ కమర్షియల్ సక్సస్ ను సాధించింది. అంతేకాదు బాలయ్య పాత్ర మాస్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాతో జగపతి బాబు కి మంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. లెజెండ్ నుంచి జగపతి బాబు అద్భుతమైన క్యారెక్టర్స్ తో ఏలుతున్నాడు. ఇలా బాలయ్యకి రెండు భారీ హిట్స్ ఇచ్చిన బోయాటి శ్రీను హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడి అవుతున్నాడు. ఎన్.బి.కె 106 గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలై లాక్‌డౌన్ కారణంగా బ్రేక్ పడింది.

 

అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ ని ఇప్పటికి ఫైనల్ చేయకపోవడం కాస్త బాలయ్య ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంట్ గా ఉంది. సింహ లో నయనతార సూపర్బ్ అనిపించింది. నమిత, స్నేహ ఉలాల్ కూడా బాగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత లెజెండ్ లోను రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ లు సినిమాకి బాగా సపోర్ట్ గా నిలిచారు. అయితే ఈ హ్యాట్రిక్ సినిమాలో హీరోయిన్స్ ని మాత్రం ఇంకా ఎందుకు రివీల్ చేయలేదన్నది ఫ్యాన్స్ కి క్యూరియాసిటీగా మారింది. అయితే రీసెంట్ గా బోయపాటి ఈ సినిమాలో నటించబోయో హీరోయిన్స్ ని మంచి సమయం చూసి రివీల్ చేస్తామని వెల్లడించారు. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: