టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా రామ్ గోపాల్ వర్మ తీసిన అంతం, రాత్రి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ, ఆ తరువాత ఏవీఎస్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హీరోస్ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, అంజలి ఝవేరి ల కలయికలో వచ్చిన ప్రేమించుకుందాంరా సినిమాకు మూడు సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించి మంచి హిట్ అందుకున్నారు. ఆ తరువాత మెగాస్టార్, రంభ ల కలయికలో వచ్చిన బావగారు బాగున్నారా సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన మణిశర్మ, దానికి అద్భుతమైన సాంగ్స్ ని అందించడంతో పాటు సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో మంచి పేరు దక్కించుకున్నారు. 

 

ఇక ఆపై చూడాలని ఉంది, సమరసింహా రెడ్డి సినిమాల నుండి మొదలైన మణిశర్మ ప్రస్థానం, అనతికాలంలోనే ఎంతో గొప్ప  స్థాయికి చేరుకుంది. ఇక అప్పట్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దాదాపుగా అనేక సినిమాలు చేసిన మణిశర్మ, అన్ని సినిమాలకు కూడా మంచి సాంగ్స్ ని అందించేవారు. ఆ తరువాత నుండి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా అందరికీ కూడా మంచి హిట్ సాంగ్స్ అందించిన మణిశర్మ, అనంతరం కొన్నేళ్ల తరువాత దేవిశ్రీప్రసాద్, థమన్, మిక్కీ జె మేయర్, అనూప్ వంటి యువ సంగీత దర్శకుల రాకతో కొంత వెనుకబడ్డారు. అయినప్పటికీ మధ్యలో అక్కడక్కడా కొన్ని సినిమాలు చేస్తున్న మణిశర్మ, ఇటీవల లై, ఇస్మార్ట్ శంకర్, దేవదాస్ సినిమాలతో మళ్ళి లైం లైట్ లోకి వచ్చారు. ప్రస్తుతం మణిశర్మ చేతిలో చాలానే సినిమాల వున్నాయి. 

 

కాగా వాటిలో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ల కలయికలో రూపొందుతున్న ఫైటర్, మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివల ఆచార్య, విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమాలతో పాటు సాయిధరమ్ తేజ్ దేవకట్టా ల సినిమా, అలానే నితిన్, కృష్ణ చైతన్యల పవర్ పేట సినిమాలు కూడా ఉన్నాయి. మరోవైపు రామ్ హీరోగా తెరకెక్కుతున్న రెడ్ మూవీకి కూడా మ్యూజిక్ అందిస్తున్న మణిశర్మ, రేపు లాక్ డౌన్ అనంతరం ఒక్కొక్కటిగా రిలీజ్ అయ్యే ఈ సినిమాలతో ల్యాండ్ అయితే, మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ కి బ్యాండే అని అంటున్నారు ఆయన అభిమానులు. మరి ప్రస్తుతం కంపోజ్ చేస్తున్న సినిమాల ద్వారా మణిశర్మ ఎంతమేర పేరు దక్కించుకుంటారో చూడాలి.....!!!  

మరింత సమాచారం తెలుసుకోండి: