టాలీవుడ్ లో కష్టపడి పైకి వచ్చిన హీరో అనగానే చాలా మంది కొందరు పేర్లను పదే పదే చెప్తూ ఉంటారు. తండ్రులు నిర్మాతలు అయినా వాళ్లకు ఎంత పేరు ఉన్నా సరే వారు మాత్రం తమ తండ్రి ని గాని తమ తాతను గాని గుర్తుంచుకోవడ్డు తమను గుర్తు ఉంచుకోవాలి అనే విధంగా కష్టపడి సినిమాలు చేసారు. వారి లో ప్రధానంగా చెప్పుకునే వ్యక్తి జగపతి బాబు అనేది వాస్తవం. తన తండ్రికి ఎంత ఇమేజ్ ఉన్నా సరే అతను మాత్రం తన కృషి తో పైకి వచ్చారు. తన తండ్రి ని గుర్తించాలి అంటే తన పేరు చెప్పుకోవాలి అనే విధంగా ఆయన కష్టపడ్డారు. 

 

సినిమా కెరీర్ లో ఎన్నో కష్టాలు పడినా సరే ఎక్కడా కూడా తన తండ్రి కి ఉన్న అగ్ర నిర్మాత అనే ఇమేజ్ ని వాడుకునే సాహసం కూడా ఆయన చేయలేదు అనేది వాస్తవం. ఆ విధంగా జగపతి బాబు కష్టపడి పైకి వచ్చారు అనేది వాస్తవం. చిన్న హీరోలు కూడా తమ తండ్రికి ఉన్న ఇమేజ్ ని వాడుకుంటున్న ఈ రోజుల్లో ఆయన మాత్రం ఎక్కడా కూడా వాడుకోలేదు అనేది వాస్తవం. నేడు జగపతి బాబు కెరీర్ పీక్స్ లో ఉంది. ఇక ఇదే సమయంలో ఆయన కెరీర్ లో చూసిన కష్టాలు పడిన ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. 

 

అవి ఏంటీ అంటే ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయి ఆయనను పక్కన పెట్టే వరకు దర్శక నిర్మాత లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. అయినా సరే ఎక్కడా కూడా భయపడకుండా ఆయన సినిమాలు చేసి పైకి వచ్చాడు గాని తండ్రి  ఇమేజ్ తో ఆయన పైకి వచ్చిన సందర్భం ఎప్పుడు కూడా లేదు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: