దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను మూడు కేటగిరీలుగావిభజన చేసి రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లు గా చేసిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు  ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ అందించే విషయంలో కూడ మినహాయింపులు ఇచ్చే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్ తెరవడానికి నిబంధనలు రూపొందిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 


జన సమూహం ఎక్కువగా గుమిగూడే థియేటర్స్ షాపింగ్ మాల్స్ వల్ల   కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ఇప్పటి వరకు వీటిని మూసి వేసిన విషయం తెలిసిందే.  సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్ పై ఆధారపడి కొన్ని లక్షల  కుటుంబాలు జీవిస్తున్న పరిస్థితులలో వీటిని ఏవిధంగా ఓపెన్ చేయాలి అంటూ కసరత్తులు సాగిస్తున్నట్లు సమాచారం. 


అయితే సాయంత్రం 7 గంటల లోపే సినిమా షోలు పూర్తయ్యేలా షరతులు ప్రభుత్వాలు పెడతాయి అని అంటున్నారు. సినిమా హాల్ లో సీటుకి సీటుకి మధ్య ఒక సీటు గ్యాప్ ఉండేలా ఉండేలా చూసుకోవడంతో పాటు  ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలనే నిబంధన  పెడతారని టాక్. అయితే ఈవిషయాలు అన్ని అమలులోకి రావడానికి కనీసం రెండు నెలలు పడుతుంది అని లీకులు వస్తున్నాయి. 


అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రానికి రాజమౌళి ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ జులై 30కి థియేటర్స్ ఓపెన్ అవుతాయని ఒక అంచనా వస్తోంది. వస్తావానికి  ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ డేట్ కు ధియేటర్స్ ఓపెనింగ్ డేట్‌ కి ఎటువంటి సంబంధం లేకపోయినా యాధృశ్చికంగా రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాను విడుదల చేయడానికి ఎప్పుడో ఊహించుకున్న డేట్ కు ‘ఆర్ ఆర్ ఆర్’ రాలేకపోతున్నా ఆ డేట్ కు ధియేటర్స్ ఓపెన్ అయితే అది యాధృశ్చికం అనుకోవాలి. సినిమా షూటింగ్స్‌కి జూన్ నుంచి పర్మిషన్ లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నప్పటికీ థియేటర్స్ తిరిగి ఓపెన్ అయితే కాని టాలీవుడ్ ఇండస్ట్రీలో హడావిడి వాతావరణం కనిపించదు కాబట్టి ఈ లీకులు నిజం కావాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే ఓవర్సీస్ రిలీజ్‌ తో పనిలేని చిన్న సినిమాలు జులైలో విడుదల అవుతాయని ఆతరువాత మీడియం రేంజ్ సినిమాలు షెడ్యూల్ అవుతాయి అని అంటున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: