రానా... టాలీవుడ్ లో పైకి వచ్చిన స్టార్ ఫ్యామిలీ కొడుకు. స్టార్ ఫ్యామిలీ వారసుడు. దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చినా సరే ఎక్కడా కూడా తాను పైకి రావడానికి తండ్రి సురేష్ బాబు పేరు గాని తాత రామా నాయుడు పేరు గాని వాడుకున్న సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అనే చెప్పాలి. ఎంత స్టార్ హోదా అతని కుటుంబానికి ఉన్నా సరే రానా మాత్రం ఎక్కడా కూడా దానిని తాను పైకి రావడానికి గానీ తాను సినిమాలు చేయడానికి గానీ వాడుకున్న సందర్భం అనేది ఎప్పుడు ఎక్కడా లేదు అనేది వాస్తవం. ప్రస్తుతం అతను ఏ సినిమా చేసినా సరే... 

 

కథ పూర్తిగా భిన్నం గా ఉండటమే గాని ఎక్కడా కూడా అగ్ర దర్శకుల తో సినిమాలు చేసిన సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అనేది వాస్తవం. ఏ కథ ను ఎంపిక చేసుకున్నా సరే తనను రానా గా గుర్తుంచుకోవాలి గాని ఎక్కడా కూడా తన బాబాయి పేరు గాని తన తండ్రి పేరు గాని వద్దు అని ప్రయత్నాలు చేసాడు. అతను ఎంచుకునే కథలు కొనే సినిమాలు అన్నీ కూడా చాలా వరకు భిన్నం గానే ఉంటాయి గాని ఎక్కడా కూడా రెగ్యులర్ కథలతో అతను సావాస౦ చేసిన సందర్భం అనేది ఉండదు అనే మాట అందరికి తెలిసిందే. 

 

లీడర్ సినిమా అయినా నేనే రాజు నేనే మంత్రి అయినా కృష్ణం వందే సినిమా అయినా ఏది అయినా సరే పూర్తి భిన్నం గా ఉంటుంది. ఆ విధంగా అతను కష్టపడ్డాడు. నేడు అతను ఏ సినిమా చేస్తున్నా రానా సినిమా వస్తుంది అని అన్ని వర్గాల ప్రేక్షకులు చూడటమే గాని అతనికి గాని అతని ఫ్యామిలీ కి గాని ఉన్న ఇమేజ్ తో చూసిన సందర్భం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: