టాలీవుడ్ లో రామ్ చరణ్ కి ఉన్న స్టార్ ఇమేజ్ గురించి అందరికి తెలిసిందే. తన తండ్రి అగ్ర హీరో అయినా సరే తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నం చేసాడు రామ్ చరణ్. తన సినిమాలు తన నటన  అన్నీ కూడా తనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని సంపాదించాయి అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కుమారుడు కూడా ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో కష్టపడిన సందర్భం అనేది లేదు. మొదటి సినిమాకు తన తండ్రి ఇమేజ్ ఉపయోగపడినా ఆ తర్వాత నుంచి అతను తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అనేది వాస్తవం. 

 

ఏ స్థాయిలో రామ్ చరణ్ ఎదగాలి అని ప్రయత్నాలు చేసాడు అంటే... తన సినిమా కథల విషయంలో తన తండ్రి కి కూడా చెప్పకుండా తనకు తాను అతను పైకి వచ్చే ప్రయత్నం చేసాడు అనేది వాస్తవం. ఆ విధంగా రామ్ చరణ్ కష్టపడ్డాడు. సినిమా హిట్ కి గాని ఫ్లాప్ కి గాని తన తండ్రిని ఏ విధంగా కూడా రామ్ చరణ్ వాడుకున్న సందర్భం అనేది ఎప్పుడూ లేదు. ఏ సినిమా చేసినా సరే తాను సొంత గా కథ ను ఎంపిక చేసుకున్నాడు గాని తన తండ్రి సహకారాన్ని ఏ సందర్భం లో కూడా తీసుకున్నది లేదు. 

 

ఇక అతను చేసిన రంగస్థలం సినిమా తో అతనికి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. అతనికి ఆ సినిమా ఒక రేంజ్ లో పేరు తీసుకుని వచ్చింది. టాలీవుడ్ లో ఎవరూ కూడా అంటే ఈ స్టార్ హీరో కూడా ఈ మధ్య కాలం లో ఆ స్థాయిలో ప్రయోగం చేసిన సందర్భం లేదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: