పెళ్ళి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ ఒక్క సినిమాతో అతడు స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ పడడంతో అతడికి యూత్ లో క్రేజ్ మరింత ఏర్పడింది. అయితే దాంతో పాటే విజయ్ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఆ అంచనాలని అందుకోవడంలో దేవరకొండ విఫలమయ్యాడనే చెప్పాలి.

 

డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ ల రూపంలో రెండు డిజాస్టర్లు రావడంతో విజయ్ దూకుడుకి బ్రేక్ పడింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద మరీ ఘోరంగా పరాజయాన్ని చవిచూశాయి. దాంతో విజయ్ కొంత ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ భామ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

 

ఇదిలా ఉంటే, ఈ సినిమా అనంతరం విజయ్ మూవీ ఏ దర్శకుడితో ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని చెప్పినప్పటికీ, ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందనేది కన్ఫర్మ్ కాలేదు. శివ నిర్వాణ నానితో టక్ జగదీష్ మూవీ స్టార్ట్ చేశాడు. అయితే తాజా  సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని అర్థం అవుతోంది.

 

విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఇంద్రగంటి విజయ్ ని విష్ చేస్తూ నువ్వు మంచి మంచి సినిమాలు చేయాలని కోరాడు. దానికి బదులుగా విజయ్ సమాధానమిస్తూ, మనిద్దరం కలిసి అలాంటి సినిమా చేద్దామని ట్వీట్ చేశాడు. దీన్ని బట్టి వీరిద్దరి కాంబినేషన్లో మూవీ ఉంటుందని వచ్చిన వార్తలు మరికొద్ది రోజుల్లో నిజమయ్యేలా ఉన్నాయి. నాని వి విడుదల తర్వాత విజయ్ తో ఇంద్రగంటొ మూవీ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: