టాలీవుడ్ లో మహేష్ బాబు అంటే ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. అగ్ర హీరో కృష్ణ కుమారుడు అయినా సరే అతను పైకి వచ్చిన తీరు గాని చేసిన సినిమాలు గానీ అన్నీ కూడా భిన్నంగానే ఉంటాయి అనేది వాస్తవం. ఏ సినిమా చేసినా సరే తాను తన ఇమేజ్ తో చేసిన సందర్భమే గాని తన తండ్రి ఇమేజ్ ని వాడుకుని చేసిన సందర్భం అనేది ఎప్పుడు లేదు అనే చెప్పాలి. మురారి సినిమా అయినా ఒక్కడు సినిమా అయినా ఏది అయినా సరే నటుడి గా అతను మంచి పేరు తెచ్చుకున్నాడు అనేది వాస్తవం. 

 

ఒక సందర్భంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అతనిని ఉద్దేశి౦చి ఒక వ్యాఖ్య చేసారు. సినిమా ఫెయిల్ అయినా మహేష్ బాబు ఫెయిల్ అయ్యే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. అవును మహేష్ బాబు సినిమాలు చూస్తే అదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. మహేష్ సినిమా ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు అనేది అందరికి తెలిసిందే. ప్రతీ సినిమా కథ కూడా తాను సొంత గా ఆలోచించి ఎంపిక చేసుకున్నదే, డాన్స్ రాదు అని ఎవరు అయితే అన్నారో మహేష్ డాన్స్ చూసి బెస్ట్ డాన్సర్ అని కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. 

 

తక్కువ కాలంలో మహేష్ కి మంచి గుర్తింపు వచ్చింది అనేది అందరికి తెలిసిందే. అతని గ్లామర్ అయినా అతని నటన అయినా మరొకటి అయినా ఏది అయినా సరే తనకు తాను గా పైకి వచ్చాడు గాని తండ్రి పేరు ని తన సినిమాకు గాని సినిమా ప్రచారానికి గానీ వాడుకున్న సందర్భం అనేది ఎప్పుడు లేదు అనేది వాస్తవం. మహేష్ ప్రస్తుతం పరుశురాం తో సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: