స్వయంకృషే శ్రీరామరక్షగా, పట్టుదలే పెట్టుబడిగా అట్టడుగు స్థాయి నుండి ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ ఎన్నో అవరోధాలను అధిరోహిస్తూ... పడుతూ లేస్తూ తెలుగు పరిశ్రమకు బ్రేక్ డాన్స్ నేర్పిన హీరో చిరంజీవి మన తెలుగు సినిమాల ఖ్యాతిని భారతదేశ నలుమూలలా వ్యాప్తి చేశాడు. బీకాం పూర్తి చేసిన చిరంజీవి చెన్నైలోని ఫిలిం ఇన్స్టిట్యూట్ కి దరఖాస్తు చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఫిలిం ఇన్స్టిట్యూట్ వాళ్ళు చిరంజీవిని ఇంటర్వ్యూ కి రమ్మని లేఖ ద్వారా తెలియపరిచారు. ఐతే ఆ లేఖను చదివిన చిరంజీవి తండ్రి వెంకట్రావు చిరంజీవి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి ని పిలిచి ఏంట్రా పెద్ద చదువు చదువుకొని ఉద్యోగం చేయకుండా ఇలా సినిమాలో కి వెళ్తున్నావా అని గట్టిగా నిలదీశాడు. సమాధానంగా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాన్న అంటూ బాగా ధైర్యం తెచ్చుకొని చిరంజీవి తన మనసులోని మాటను బయటపెట్టాడు.


నిన్ను ఎస్ ఐ చదివిద్దాం అనుకున్నాను, మీ అమ్మగారు నువ్వు డాక్టర్ కావాలని ఆశించారు. నువ్వు బైపీసీలో చేరి చేతగాక మళ్ళీ బీకాం చేసి మీ అమ్మ ఆశలపై నీళ్ళు చల్లినవ్. సరే బీకామ్ పూర్తిచేసి ఉద్యోగం సంపాదిస్తావని నీ తోబుట్టువుల కే ఆదర్శవంతంగా మారతావని అనుకుంటే... నువ్వు మాత్రం సినిమాలు షికార్లు తిరుగుతున్నావ్ అని చిరంజీవి పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు వెంకట్రావు. అసలు సినిమా అవకాశాలు రావడం చాలా కష్టమని... నువ్వు అనుకున్నంత ఆషామాషీగా సినిమా అవకాశాలు రావని వెంకట్రావు చిరంజీవికి సర్ది చెప్పాడు. అయితే చిరంజీవికి నటించాలనే ఆలోచన తప్ప మరేమీ లేదు.


దాంతో తాను వేరొక ప్లాన్ ఆలోచించి ఐసిడబ్ల్యూ చదవడానికి మద్రాసు వెళ్తానని తన తండ్రికి చెప్పాడు. చదువుకోవడానికి వెళ్తున్నాడు కదా అని సంబరపడిపోయిన తండ్రి వెంటనే అతడిని మద్రాసుకి పంపించాడు. 1977 జనవరి 22న తెలుగు మద్రాస్ కి బయల్దేరాడు. అక్కడ తన ఫ్రెండు రఘురామ్ అద్దెకుంటున్న ఇంటికి వెళ్లి ఆ రూమ్ లో ఉన్నందుకు గాను నెలకు 12 రూపాయల రెంట్ కట్టేవారు. వెంకట్రావు తన కొడుకుకి నెలకి వందరూపాయలు పంపించేవాడు. ఐసిడబ్ల్యూ లో జాయిన్ అయిన చిరు పగలంతా చదువుకుంటూ సాయంత్రం వేళ వెస్ట్రన్ డాన్స్ నేర్చుకునేవాడు. డైలాగ్ డెలివరీ నేర్పించే వాళ్ళ దగ్గరికి కూడా ప్రతిరోజు వెళ్ళేవాడు.


ఆ సమయంలోనే దక్షిణ భారత దేశ చలన చిత్ర ఇన్స్టిట్యూట్ వారు నటనపై ఆసక్తి ఉన్నవారు మమల్ని సంప్రదించవచ్చు అని ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన చదివిన వెంటనే చిరు దరఖాస్తు చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక లెటర్ చిరంజీవి చేతికి అందింది. ఆ లెటర్లో ఇన్స్టిట్యూట్ కి నాలుగు డైలాగులు నేర్చుకుని రావాల్సిందిగా పేర్కొని ఉంది. డైలాగులన్నీ బాగా నేర్చుకున్న చిరంజీవి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళగా అక్కడ దాసరి, విశ్వనాథ్ ఇంకో ఇద్దరు ఉన్నారు. చిరు ని పిలిచి మీ ఇంట్లో వాళ్ళ అనుమతితోనే వచ్చావా అని అడగగా అవునండీ అని సమాధానమిచ్చాడు. ఆపై వాళ్ళు అడిగినట్టు డైలాగులు చెప్పాడు. చిరంజీవి డైలాగ్ డెలివరీకి మంత్రముగ్ధులు అయిపోయారు.


తదనంతరం నీకు వచ్చిన ఏదైనా టాలెంట్ మాకు చూపించు అని అడిగినప్పుడు చిరంజీవి వెస్ట్రన్ డాన్స్ వేసి వారి మనసులను దోసుకున్నాడు. దాంతో ఇంకా ఫిదా అయిపోయిన ఇంటర్వ్యూ చేసే ఆ నలుగురు వెంటనే చిరంజీవిని సెలెక్ట్ చేసేది నటనలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే హాస్యనటుడు సుధాకర్ పరిచయమయ్యాడు. అతనికి తమిళంలో ఒక సినిమా, తెలుగులో పునాదిరాళ్ళు అనే మరొక సినిమాలో అవకాశాలు ఒకేసారి రావడంతో... ఏ సినిమాలో నటించాలో తెలియలేదు.


దాంతో చిరంజీవిని వెంటబెట్టుకుని తనకు అవకాశం ఇచ్చిన పునాదిరాళ్లు సినిమా డైరెక్టర్ వద్దకు వెళ్లి తనకు రెండు చిత్రాల్లో ఒకేసారి నటించే ఛాన్సులు వచ్చాయని ఎలా చేయాలనే అడగగా.... చిరంజీవి ని చూసిన ఆ డైరెక్టర్ ఇతనెవరని అడిగి తదనంతరం తన పునాదిరాళ్ళు సినిమాలో నటింప చేశాడు డైరెక్టర్. తన మొట్టమొదటి పాత్రలోనే చిరంజీవి మంచిగా ఒదిగిపోయి అశేషమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత అతని పట్టుదల శ్రమ మనస్తత్వం తెలుసుకున్న ప్రతి ఒక్క డైరెక్టర్లు నిర్మాతలు అతనికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశాలను కల్పించారు.ఈ విధంగా చిరంజీవి ఎంతో కష్టపడి తన కష్టాన్ని నమ్ముకొని ఈ స్థాయికి వచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: