మాస్ మహారాజ ర‌వితేజ.. ఈయ‌న గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌నం ఎంచుకున్న రంగంలో అవకాశం రావాలంటే ముందు అందులో ఏదో ఓ విధంగా దూరిపోవాలి. అదే చేశాడు ర‌వితేజ‌. తనకిష్టమయిన సినిమా ఇండస్ట్రీకి హీరో కావాల‌ని వ‌చ్చిన ర‌వితేజ ముందు చిన్న చిన్న పాత్ర‌లు చేస్తూ.. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. ఈ క్ర‌మంలోనే ప‌లు సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప‌ని చేశాడు. కొనాళ్లకి 'నీకోసం' సినిమాతో హీరో అయ్యాడు. శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం ర‌వితేజ‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ చిత్రంలో ర‌వితేజ నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. 

 

ఆ త‌ర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో హీరోగా చేయగా సూపర్ హిట్ అయి హీరోగా గుర్తింపు వచ్చి `ఇడియట్` సినిమాతో సెటిల్ అయ్యాడు. ఇక ఆ త‌ర్వాత ర‌వితేజ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. మంచి మంచి క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన ర‌వితేజ ఎంద‌రికో స్పూర్తి. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్, బలుపు, పవర్, దరువు, దుబాయ్ శీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం, లాంటి భారీ విజయాలతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఏర్ప‌ర్చుకున్నాడు.

 

అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అలా లేవ‌నే చెప్పాలి. మాస్ మహారాజా రవితేజ హిట్ కొట్టి చాలా కాలమైంది. లేటెస్ట్ గా వచ్చిన డిస్కో రాజాకు కూడా యావరేజ్ రేటింగులే వచ్చాయి. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో `క్రాక్` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా విజయం సాధిస్తే తప్ప రవితేజ కెరీర్ కు మంచి రోజులు రావంటున్నారు కొంద‌రు. ఒక రకంగా చెప్పాలంటే గోపీచంద్ సినిమా రవితేజ కు డు ఆర్ డై లాంటిది. కచ్చితంగా విజయం సాధించాల్సిందే అన్న చందంగా ఉందంటున్నారు విశ్లేష‌కులు.

 


  

మరింత సమాచారం తెలుసుకోండి: