పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత డిఫరెంట్ గా ఉంటాడో ఆయన అభిమానులు కుడా అంతే డిఫరెంట్ గా ఉంటారు. సాధారణంగా ప్రతీ హీరోకి అభిమానులు ఎక్కువగానే ఉంటారు. కానీ పవన్ కి డైహార్డ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. పవన్ సినిమా వచ్చినా, రాకపోయినా ఆ అభిమానం అంతే ఉంటుంది. సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లోకి వెళ్ళినా పవన్ పై అదే అభిమానాన్ని చూపిస్తుంటారు. అయితే నేడు గబ్బర్ సింగ్ రిలీజై ౮ సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారి సందడి మామూలుగా లేదు.

 

౨౦౧౨లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీసు రికార్డులని షేక్ చేసింది. ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చింది. జల్సా తర్వాత హిట్ పడేదెప్పుడా అని ఎదురుచూస్తున్న టైమ్ లోసాలిడ్ హిట్ తో మన ముందుకొచ్చాడు పవన్ కళ్యాణ్. పవన్ అభిమాని అయిన హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పవన్ సినిమా కెరీర్ ని పూర్తిగా మలుపు తిప్పింది.

 

ఈ మధ్య సొషల్ మీడియాలో కొత్త ట్రెండ్ మొదలైంది. సినిమా యానివర్సరీలు జరుపుకోవడం కామన్ గా తయారైంది. సినిమా విడుదల తేదీరోజుని పురస్కరించుకుని సొషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. నేడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ సినిమా గురించి ట్రెండింగ్ చేయడం మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపుతిప్పిన చిత్రమైన గబ్బర్ సింగ్ చిత్రాని మర్చిపోకుండా చేయడానికా అన్నట్టు మిలియన్లలో ట్వీట్స్ వేసారు.

 

పవన్ అభిమానుల టార్గెట్ ప్రకారం పది మిలియన్ల ట్వీట్లు వేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఈ పాటికే ౨౦మిలియన్లు చేరుకుంది. #8YrsOfGabbarSinghHysteria అనే హ్యాష్ ట్యాగ్ తో మోత మోగిస్తున్నారు. ఈ లెక్కన నేటితో ఏ తెలుగు హీరోకి రానన్ని ట్వీట్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఇదే రికార్డుగా నిలిచింది. ఈ రోజు సాయంత్రం వరకు మరెన్ని రికార్డులు క్రియేట్ చేయనుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: