పవన్ కళ్యాణ్ రెండవ మాజీ భార్య రేణు దేశాయ్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. అయితే తాను తన పిల్లలను ఎక్కువగా బయట తిరగనియదు. అలాగే మీడియాలో కనపడకుండా జాగ్రత్త పడుతోంది. కానీ ఇటీవల కాలంలో ఆమె తన పిల్లలను సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులకు పరిచయం చేస్తుంది. గత రెండు నెలల క్రితం తన పిల్లల మొట్టమొదటి ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రేణు దేశాయ్ ఆ తర్వాత కూడా తరచుగా వారికి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తుంది. అలాగే తన భర్త పవన్ కళ్యాణ్ గురించి అడపాదడపా మాట్లాడి వార్తల్లోకి ఎక్కుతుంది.


తాజాగా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రేణుదేశాయ్ మాతృ దినోత్సవం సందర్భంగా ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి ప్రేమ అనే ఒక ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అయితే ప్రేమ రేణుదేశాయ్ ని ఒక ప్రశ్న అడుగుతూ... మీ పిల్లలకు ఏ హీరో అంటే ఇష్టం అని అడగగా... దానికి మొదటిలో సమాధానం చెప్పలేక పోయిన రేణుదేశాయ్ తర్వాత ప్రేమ హింట్ ఇవ్వడంతో తమ పిల్లలకు ఇష్టమైన హీరో పేరు చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ముఖ్యంగా తన కూతురు అఖిరా కు అడవి శేషు అంటే బాగా ఇష్టమట. తనని ఎప్పుడూ అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటుందట.


ఇకపోతే నిన్న మాతృ దినోత్సవం కాబట్టి తమ పిల్లలు తనకోసం రహస్యంగా ఏదో తయారుచేసి తనకి సప్రైజ్ ఇస్తున్నారని ఈ లైవ్ చాట్ లో ఆమె తెలిపింది. అలాగే తమ పిల్లల్ని ఎప్పుడూ కొట్టలేదని... కాకపోతే ఏదైనా పని చేయకపోయినా... మాట వినకపోయినా గట్టిగా మందలిస్తానని ఆమె తెలిపింది. ఈ ఇంటర్వ్యూ లో తన పిల్లలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా సమాధానాలు చెప్పి తన పిల్లల గురించి ఎంతగా తను పట్టించుకుంటుందో చెప్పకనే చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: