మెగా మేనళ్లు సాయి తేజ్ వరుసగా ఆరు ప్లాపులు అందుకుని లాస్ట్ ఇయర్ మొదట్లో చిత్రలహరితో హిట్ ట్రాక్ ఎక్కి ఆ తర్వాత వచ్చిన ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. సుబ్బు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా తర్వాత ఈమధ్యనే దేవా కట్ట డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా మరో సినిమా కథ వింటున్నట్టు టాక్. 

 

మెగా హీరోల్లో సక్సెస్ ఫుల్ కెరియర్ తో దూసుకెళ్తున్న సాయి తేజ్ మెగా ఫ్యాన్స్ అండదండలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక లేటెస్ట్ గా సాయి తేజ్ ట్విట్టర్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకెళ్తుండగా.. ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించాడు. మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి సుప్రీం హీరోగా సత్తా చాటుతున్న సాయి తేజ్ సోషల్ బ్లాగ్స్ లో తన ఫాలోవర్స్ పెంచుకుంటూ పర్ఫెక్ట్ ప్లాన్ లో ఉన్నాడు. 

 

మెగాస్టార్ ఫ్యామిలీ వెనుక ఉన్నా సరే సొంత టాలెంట్ తో క్రేజ్ తెచ్చుకుంటున్న సాయి తేజ్ సరైన ఛాన్స్ వస్తే సంచలనాలు సృష్టించేలా ఉన్నాడు. ఆరు ప్లాపుల తర్వాత రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన ఈ సుప్రీం హీరో కచ్చితముగా రాబోయే రోజుల్లో క్రేజీ హిట్లు కొడతాడని చెప్పొచ్చు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా హిట్టు పక్కా అంటూ ఫిల్మ్ నగర్ టాక్. సాయి తేజ్ ఇంటి నుండి తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.       

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#nocaptionneeded #throwback #2018

A post shared by Sai Dharam Tej (@jetpanja) on

మరింత సమాచారం తెలుసుకోండి: