సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ కిడ్స్‌కి ఉండే ఫాలోయింగే వేర‌ని చెప్పాలి. అందులోనూ కాస్త క్రేజ్ ఉన్న పెద్ద హీరోల‌యితే ఆ క్రేజ్ మ‌రి కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొడుకు అఖిరానంద‌న్ సినిమాల్లోకి ఎప్పుడు వ‌స్తాడంటూ ఫ్యాన్స్ అంతా తెగ ఎదురు చేసేస్తున్నారు.  అకీరా నందన్ అంటే ఇప్పటికే మెగా అభిమానులకు ప్రత్యేకమైన అభిమానం. తండ్రికంటే చాలా పొడవుగా ఉన్న అకీరాను చూసి పవన్ అభిమానులు  తెగ మురిసిపోతుంటారు. ఇదిలా ఉంటే ఈమధ్య అకీరా టాలీవుడ్ డెబ్యూ పై కొన్ని వార్తలు వచ్చాయి.

 

అన్నయ్య రామ్ చరణ్ అకీరాను లాంచ్ చేయ‌బోతున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై రేణు దేశాయి స్పందిస్తూ “తనకు యాక్టర్ కావాలనే ఇంట్రస్ట్ లేద‌ని చెప్పింది. ప్ర‌స్తుతానికి త‌ను అలాంటి ఆలోచ‌న‌ల్లో అస‌లు లేడ‌ని ఆమె తెలిపింది. నేను అడిగితే ‘నాకు ఇంట్ర‌స్ట్ లేదు’ అన్నాడు. ఇప్పటికైతే హీరో అయ్యేందుకు 1% ఇంట్రెస్ట్ కూడా త‌న‌లో లేద‌ని ఆమె తేల్చి చెప్పేసింది. నేను కూడా బలవంతంగా అకీరాను అందులోకి పంపదలుచుకోలేద‌ని అత‌ని త‌ల్లి రేణుదేశాయ్ తెలిపింది. మా అబ్బాయి హీరో అయితే నాకు వచ్చేది లేదు పోయేది లేదు. అది అతని ఛాయిస్.. నేను ఎప్పుడూ వాడి ఇంట్ర‌స్ట్ మీదే వ‌దిలేస్తా. వాడిని ఫోర్స్ చేయ‌ను అంటూ క్లారిటీ ఇచ్చారామె. అయితే చాలా మంది అకీరాపై ఈ విషయం మీద కాస్త ఒత్తిడైతే ఉంద‌న్న విష‌యం తెలిసిందే. 

 

 
“అకీరా పొడవుగా ఉండడంతో.. ప్రతి ఒక్కరు ‘ఈ అబ్బాయి హీరో అవుతాడు’ అని అనేస్తున్నారు త‌ప్పించి వాడికి ప్ర‌త్యేకంగా ఎటువంటి ఇంట్ర‌స్ట్ అయితే లేదు. అయితే నేను కూడా ఫ్యాన్స్‌తో ద‌య‌చేసి అలా  చెప్పొద్దు అని ఆపుతున్నాను. తనపై ఒత్తిడి పెంచడం నాకు ఇష్టం లేదు” అన్నారు. అమ్మగా రేణు దేశాయి చెప్పిన మాటలు అర్థం చేసుకోవచ్చు. అయితే ‘ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేదు’ అని కదా.. మరో రెండు మూడేళ్ళు ఆగితే అప్పుడేమ‌న్నా అకీరాకు సినిమాలపై ఇంట్రెస్ట్ రావచ్చేమో. ఎందుకంటే త‌ల్లిదండ్రులిద్ద‌రూ యాక్ట‌ర్స్ కాబ‌ట్టి చెప్ప‌లేమ‌ని అభిమానులు వారి ఆశ‌ల‌ను చంపుకోకుండా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: