టాలీవుడ్ లో ఒకటీ రెండు సినిమాలు తీసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు, దర్శకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి వరుసలో వస్తారు డాలీ (కిషోర్ కుమార్ పార్ధసాని).  బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన OMG మూవీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు పవన్ కళ్యాన్, వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ ‘గోపాల గోపాల’ తెరకెక్కించారు.  ఈ మూవీ సామాన్య మానవుడికి దైవానికి జరిగిన యుద్దం నేపథ్యంలో సాగుతుంది.  ఈ క్రమంలో ఏకంగా శ్రీకృష్ణుడు ( పవన్ కళ్యాన్) రావడం.. వెంకటేష్ లో పరివర్తన తీసుకురావడం జరుగుతుంది. ఈ మూవీలో దొంగబాబాల గురించి బాగా చెప్పారు.  ఈ మూవీతో వెంకటేష్, పవన్ కళ్యాన్ కి మంచి పేరు వచ్చింది.

 

 ఆ తర్వాత పవన్ కళ్యాన్ తో డాలి మరోసారి ‘ కాటమరాయుడు’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ మూవీ తమిళ్ లో అజిత్ నటించిన వీరమ్ రీమేక్.  అయితే తమిళ్ లో సూపర్ హిట్ అయినా.. తెలుగు లో మాత్రం ఫ్లాప్ అయ్యింది.  దాంతో డాలీతో పవన్ మూవీ ఉండబోతదని అనుకున్నారు.  కానీ ఈ మద్య మరోసారి పవన్ కోసం మంచి కథతో డాలీ రంగం సిద్దం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.  

 

ప్రస్తుతం పవన్ 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో భారీ చారిత్రక మూవీతో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీ చేయనున్నాడు.  ఈ మూవీల తర్వాత డాలీతో  పవన్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.  కాకపోతే పవన్ తో మూవీ చేయడానికి చాలా సమయం పడుతున్న నేపథ్యంలో డాలీ కొత్త హీరోతో మూవీ తీయబోతున్నట్లు సమాచారం. అయితే అది పవన్ కోసం ఉంచిన కథతోనా.. లేదంటే వేరే కథ అన్న విషయం తెలియాల్సి ఉంది.  త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: