ఆమె ఓ స్టార్ హీరోయిన్. ఆమె సినిమా చేస్తే హిట్టే.  అసలు ఆమె ఓ సంచలనం. ఆమె స్టార్ ఇమేజ్ టాప్ రేంజి హీరోలకు దీటుగా ఉంటుంది. ఆమె సినిమా ఒప్పుకుంటే చాలు అని క్యూ కట్టే హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఆమె ఇండస్ట్రీకి వ‌చ్చి దశాబ్దన్నర కాలమ‌వుతున్నా కూడా ఏ మాత్రం గ్లామర్ చెక్కుచెదరలేదు. ఆమె ఇమేజ్ కూడా పెరుగుతూనే ఉంది.

 

ఇదిలా ఉండగా నయనతారని గాఢంగా ప్రేమిస్తున్న తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఆమె భవిష్యత్తులో  నా పిల్లలకు తల్లి తాజాగా ట్వీట్ చేయడం అందరికీ ఆకట్టుకుంటోంది. నయన్. విఘ్నేష్ ఇద్దరి మధ్య ప్రేమ సాగుతోంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే కొంతకాలంగా వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న నయన్ తీరు చూసిన వారు ఆమె మూడవ ప్రేమ కూడా ఫెయిల్ అయిందా అంటూ రూమర్లు పుట్టించారు.

 

దాంతో పాటు ఈ జంట కూడా ఎక్కడా అలికిడి చేయకపోవడంతో నయన్ ప్రేమ పెటాకులేనని ఒక్క లెక్కన  తేల్చేశారు దానికి బదులు అన్నట్లుగా అంతర్జాతీయ మదర్స్ డే సందర్భంగా విఘ్నేష్ చేసిన ఈ ట్వీట్ ఇపుడు సంచలనం రేపుతోంది. నయన్ తో విఘ్నేష్ డేటింగ్ కొనసాగుతోందని అందరికీ అర్ధమైంది.

 

అయితే ఈ జంట పెళ్ళి పీటలు ఎపుడు ఎక్కుతారన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గా ఉంది. అయితే ఈ విషయంలో మాత్రం విఘ్నేష్  నుంచి వత్తిడి ఉందని, నయన్ మాత్రం ఇంకా సినిమాలు చేసుకోవాలని ఆలోచిస్తోందని అంటున్నారు. మరి నయన్ ఎపుడు సై అంటే అపుడు మూడు ముళ్ళూ వేసేసి విఘ్నేష్ తన దాన్ని చేసేసుకోవడానికి సిధ్ధంగా  ఉన్నాడని అంటున్నారు.

 

మరి విఘ్నేష్  చెప్పినట్లుగా వచ్చే ఏళ్ళలోనైనా ఆయన పిల్లలకు నయన్ తల్లి అవుతుందని అంతా ఆశించాలి. ఈ ప్రేమ జంట పెళ్ళితో ఒక్కటి కావాలని కూడా అభిమానులతో సహా అంతా కోరుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: