హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు.. అవును ఈ రోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ సుధీర్ బాబు పుట్టిన రోజు. బర్త్ డే కావడంతో ఆయనకు పుట్టిన రోజు శుభాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

 

హీరోగా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న సుధీర్ బాబు.. సిక్స్ ప్యాక్ తో వారెవ్వా ఏం ఫిజిక్ అని అనిపించుకుంటున్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా హీరోగా నటిస్తున్న వి సినిమాలోని స్టిల్ రిలీజ్ చేస్తే అది ప్రేక్షకులను తెగ అట్రాక్ట్ చేస్తోంది.  సుధీర్ బాబు హాబీలో ఫిట్ నెస్ ఒక భాగం. మిగతా వాళ్లతో పోల్చుకుంటే ఒక గంట ఎక్కువ టైమే కష్టపడతాడు సుధీర్ బాబు. ఫిట్ నెస్ విషయంలో ఈ హీరో ఎవరిమాటా వినడు. జిమ్ లో గడపకుండా.. ఈ యంగ్ హీరో రోజు మొదలు కాదంటే ఆశ్చర్యం కలుగక మానదు. సినిమా సినిమాకు మన హీరోల పర్సనాలిటీ మారిపోతూ ఉంటుంది. పర్టిక్యులర్ గా ఒక్క సినిమాకు మాత్రమే సిక్స్ ప్యాక్ ట్రై చేస్తారు. కానీ.. సుధీర్ బాబు ఏ సినిమా చూసినా.. సిక్స్ ప్యాక్ తోనే కనిపించి అమ్మాయిల మనసు దోచేస్తున్నాడు.  లాక్ డౌన్ టైమ్ లోనూ క్రమం తప్పకుండా బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. ఆట విడుపుగా డబ్ స్మాష్ చేశాడు ఈ యంగ్ హీరో. 

 

ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ డైలాగ్ ని తనదైన స్టైల్ లో చెప్పాడు సుధీర్ బాబు. లాక్ డౌన్ టైమ్ లో సెలబ్రెటీస్ చాలా మంది ఇల్లు ఊడ్చి తుడిచారు. మరికొందరు వంటలు చేశారు. సుధీర్ బాబు మాత్రం ఎక్సర్ సైజ్ వీడియోలను రిలీజ్ చేసి.. ఫిట్ నెస్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పాడు. తనకిష్టమైన ఎన్టీఆర్ డైలాగ్ ను డబ్ స్మాష్ చేశాడు సుధీర్ బాబు. 

 

కరోనా అడ్డుపడకపోతే.. సుధీర్ బాబు, నాని కలిసి నటించిన వి రిలీజ్ అయ్యేది. సుధీర్ హీరోగా.. నాని విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకుడు. నివేద థామస్ సుధీర్ తో జతకట్టింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న వి విక్టరీ తీసుకొస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: