టాలీవుడ్ లో మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆయన చేసిన సినిమాలు అన్నిటిలో  దాదాపు తన గ్లామర్ తోనే విజయం సాధించారు. కాని ఒకటి మాత్రం యాక్షన్, మాస్ సన్నివేశాల వల్ల బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా పోకిరి. దీనిలో హీరోయిన్ ఇలియానా గ్లామర్ కూడా ఒక కారణం. క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్, మహేష్ బాబు కాంభినేషన్లో వచ్చిన అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా పోకిరి.  ఆసక్తికర విషయాలు ఈ సినిమా గురించి బయటకు వచ్చాయి అవి ఏంటి అంటే.. 

 

 ఈ సినిమాతో  ఇలియానా కి స్టార్ హీరోయిన్ గా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఇలియానా కెరీర్ లో వెనక్కి తిరిగి చూడలేదు. అయితే ఇలియానా ని ఎంపిక కన్నా ముందు ఈ సినిమాలో హీరోయిన్ గురించి మహేష్ కి, పూరికి మధ్య చాలా కథే నడిచిందని సినీ జనాల కథనం. అసలు ఈ సినిమాలో ఇలియానా ని తీసుకోవాలని అనుకోలేదని ఆ ప్లేస్ లో మరొక ఇద్దరు హీరోయిన్ లను అనుకున్నట్టు తెలుస్తుంది.ఈ విషయం తెలిస్తే అందరికి ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఈ సినిమాకు స్క్రిప్ట్ రాసేటప్పుడు ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండేలా ప్లాన్ చేసారట పూరి జగన్నాథ్. 

 

అందుకే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా హీరోయిన్ల పేర్లు కూడా అనుకున్నారట. ఒక హీరోయిన్ దీపిక, కాగా రెండవ హీరోయిన్ పార్వతి మెల్టన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే  దీపిక పేరుని పూరి సజెస్ట్ చేయగా, పార్వతి పేరుని మహేష్ సూచించినట్టు తెలుస్తుంది. అయితే పార్వతి, పూరికి నచ్చలేదట. ఈ క్రమంలో దీపిక వద్దని మహేష్ అన్నారని అప్పట్లో పుకార్లు వచ్చాయి. చివరికి వారిద్దరూ రాజీకి వచ్చి ఇద్దరి హీరోయిన్లను తప్పించి ఒకే హీరోయిన్ ఇలియానా ని ఫైనల్ చేసారు. ఏది ఏమైనా ఈ సినిమాతో ఇలియానా స్టార్ మార్చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: