మాతృ దినోత్సవాన్ని అందరూ ఘనంగా జరుపుకున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా తమ మాతృమూర్తులపై ప్రేమను చాటుకున్నారు. తమకు అందుబాటులో దొరికిన వాటిని గిఫ్టులుగా ఇచ్చుకున్నారు. సెలబ్రిటీలైతే తమ మాతృమూర్తులపై ఉన్న ప్రేమను వీడియో రూపంలో తీసి అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ కోవలోనే టాప్ హీరోయిన్ తమన్నా కూడా మతృదినోత్సవాన్ని కాస్తంత భిన్నంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

 

 

మాతృదినోత్సవం సందర్భంగా తమన్నా తన తల్లికి ఇంటి పనులు చేసి వండి పెట్టింది. మొబైల్ లో అలారం మోగడంతో తమన్నా బద్దకంగా నిద్ర లేచింది. ఆదరాబాదరాగా పరుగులెత్తి ఇంటి పనులన్నీ చకచకా చేసేసింది. బట్టల్ని వాషింగ్ మెషీన్ లో వేసేసింది. హాల్ లో ఉన్న ఫ్యాన్ తుడవడం, చుట్టూ వస్తువులను క్లీన్ చేయడం చేసింది. కిచెన్ రూమ్ కి వెళ్లి ఏమేం వంటలు చేయాలో ప్లాన్ చేసుకుంది. కావలిసినవి తీసుకుని వంట ప్రిపేర్ చేసేసింది. వార్డ్ రోబ్ కి వెళ్లి తనకు, తల్లికి మంచి డ్రెస్సింగ్ సెలక్ట్ చేసింది. తల్లి రజినిని సర్ ప్రైజ్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకి తీసుకొచ్చింది. చూస్తూ తమన్న స్వయంగా చేసిన వంటలు చూసి ఆమె ఆశ్చర్యపోయింది.

 

 

హ్యాపీ మదర్స్ డే అంటూ తల్లిని హగ్ చేసుకుంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో అమ్మతో ఎక్కువగా గడిపాను. అమ్మకు ప్రత్యేక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అని తన వాల్ లో రాసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది. తమన్నా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తమన్నా ప్రస్తతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ తో సీటీమార్ మూవీ చేస్తోంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: