మన తెలుగు ఇండస్ట్రీలో తాప్సీ ఝుమ్మంది నాదం సినిమాతో రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మొగుడు, మిస్టర్ పర్ఫెక్ట్, వస్తాడు నా రాజు, వీర, దరువు, గుండెల్లో గోదారి, షాడో, సాహసం, ఘాజి అటాక్, ఆనందో బ్రహ్మ, నీవెవరు, గేమ్ ఓవర్ ఇలా పలు సినిమాలలో తెలుగు ప్రేక్షకులను ఈ బ్యూటీ మెప్పించింది. ఇక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస విజయాలతో ముందుకు కొనసాగుతుంది. తాజాగా ఈ నటి విదేశీ యువకుడితో డేటింగ్ చేస్తుందన్న వార్తలు నిజమేనని నిరూపించబడ్డాయి. ఈ విషయాన్ని తాప్సీ నే స్వయంగా బయట పెట్టడం జరిగింది. 

 

ఈ విషయాన్ని తాప్సీ ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. తాప్సి మాట్లాడుతూ అతనితోనే ప్రేమలో ఉన్నాను అని తెలిపింది. ఈ విషయం మా ఇంట్లో వాళ్లకి కూడా తెలుసు.. వాళ్ళు ఒప్పుకోకపోతే కథ ఇంతవరకు వచ్చేది కాదు. నాకంటూ కొన్ని లక్షాలు ఉన్నాయి అంటూ తాప్సి తెలియచేసింది. అంతేకాకుండా నాదైనా జీవితం నాకు ఉంది మేము ఇద్దరం ఇష్టపడ్డాం.. అలాగే ఎప్పుడు ఏ సమయంలో ఏమి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు అంటూ... అలాగే ముంబై నుంచి ఢిల్లీలోని తన తల్లితో మాట్లాడుతూ అలాగే మీడియాతోనూ కూడా మాట్లాడడం జరిగింది. 

 

నిజానికి మా వాళ్లకు నువ్వు నచ్చకపోతే నీతో కటీఫ్ అని చెప్పాను.. కానీ చివరకి మా ఫ్యామిలీకి అతడు నచ్చాడు. అందుకే ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను అని తాప్సి వివరించడం జరిగింది. ఇక అతని విషయాలకు వస్తే డెన్మార్క్ బ్యాట్స్మెన్ అని మితియస్ బోతో తాప్సీ ప్రేమలో పడింది. నిజానికి అతను తాప్సి సోదరి శాగున్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా చివరకు ప్రేమగా మారింది. నిజానికి ఈ బ్యూటీ తెలుగులో మంచి విజయాలు సాధించలేక పోయినా బాలీవుడ్లో మాత్రం.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ విజయాలను సొంతం చేసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: