టాలీవుడ్ లో మాటల రచయితగా కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క జంటగా ‘మిర్చి’ మూవీ తెరకెక్కించారు.  ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది... ఫ్యాక్షనీజం ప్రేమతో కూడా గెలవొచ్చు అన్న కాన్సెప్ట్ తో మంచి విజయం అందుకున్నాడు కొరటాల.  ఈ మూవీ తో ప్రభాస్ కి కూడా బాగా కలిసి వచ్చింది.  ఆ తర్వాత కొరటాల మహేష్ బాబు తో శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు.  ఇలా తీసిన ప్రతి సినిమా సెన్సేషన్ హిట్ అందుకోవడంతో తక్కువ సమయంలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కొరటాల. 

 

 తాజాగా కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్  చిరంజీవి నటిస్తున్నారు.  ఈ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట.. కాకపోతే ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ రాలేదు. ఇక ఈ మూవీలో ఓ ప్రత్యేక పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు గత కొన్ని రోజులు గా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవలో నటిస్తున్నారు. ఈ మూవీలో చిరు, చెర్రీ గురు శిష్యుల పాత్రల్లో నటిస్తుండగా.. చెర్రీ దాదాపు 30 నిమిషాలకు పైగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో చెర్రీ పాత్ర కోసం కొరటాల కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇది వరకే ఈ పాత్ర కోసం డైలాగ్‌లు రాసి పెట్టుకున్నప్పటికీ.. ఇప్పుడు మారుస్తున్నట్లు తెలుస్తోంది.  


సినిమా రిలీజ్ అయ్యాక చెర్రీ సన్నివేశాలు సెన్సేషన్‌ క్రియేట్ చేస్తాయని కొరటాల భావిస్తున్నారట. కొరటాల మాత్రమే కాదు ఈ లాక్‌డౌన్‌ సమయంలో పలువురు దర్శకులు తమ సినిమా స్క్రిప్ట్‌లను మార్చే పనిలో పడ్డారట.  ఈ లిస్ట్‌లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్‌ తదితరులు ఉన్నారు.  ఇంత మంది హేమా హెమీలు ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారంటే.. ఈ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది. మొత్తాని ‘ఆచార్య’తో మెగా ఫ్యాన్స్ కల నెరవేరబోతుందన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: