టాలీవుడ్ లో గత కొంతకాలంగా ఒక హీరో సినిమాలో మరొక హీరో నటించడం అనేది కామన్ గా మారింది.   దీనిలో భాగంగా ఇప్పటికే చాలా మంది హీరోలు ఇటువంటి ప్రయోగాలు చేసారు. అయితే ఇండస్ట్రీలో మంచి ఫాం లో ఉన్న హీరో మహేష్ బాబు కూడా ఈ రకమైన ప్రయోగాలకు తెరదీసినట్టు తెలుస్తుంది. తాజాగా ఎఫ్ 2 మూవీ కి  సీక్వెల్ గా వస్తున్న ఎఫ్ 3 సినిమా లో మహేష్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

 

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ ఎఫ్ 3 గురించి ఒక ఇంట్రెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్న అతిధి పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా దీని గురించి కొన్ని రూమర్ లు వచ్చాయి. అయితే ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. అయితే సినీ వర్గాల సమాచారం మేరకు ఇది పూర్తిగా అవాస్తమని తెలుస్తుంది.

 

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమాతో బిజీగా ఉంటే వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాఫ్ట్ లో ఒక చిత్రం తో బిజీగా ఉన్నారు. దీని వల్ల ఎఫ్ 3 సినిమాని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసారు. ఆ ఇద్దరి హీరోల సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడటం తో దాని ప్రభావం ఎఫ్ 3 పై పడిందని సినీ జనాల కథనం. ఏది ఏమైనా మహేష్ మాత్రం ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: