టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయిన అసారే సాయి పల్లవి కి వచ్చిన ఇమేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో ఇప్పుడు పాప సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురు చూసే పరిస్థితి ఉంది అనేది వాస్తవం. ఆ విధంగా ఆమె తనకంటూ ఒక ఇమేజ్ ని తీసుకుని వచ్చింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆమె తెలుగులో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఎప్పుడో ఒక సినిమా చేసిన ఆమె ఇప్పుడు రెండు సినిమాలను లైన్ లో పెట్టింది. ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి అయింది. 

 

ఇక దీని తో పాటుగా పాప మరో సినిమాను కూడా లైన్ లో పెట్టింది అని అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా వస్తున్న పుష్పా సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి. అయితే హీరోయిన్ అంటే ఆమె పూర్తి స్థాయిలో కాదు. అల్లు అర్జున్ కి ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లవ్ గా నటిస్తుంది అని టాక్. పల్లెటూరు అమ్మాయి గా ఆమె ఈ పాత్రలో కనపడుతుంది అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ఆమె భారీగానే డిమాండ్ చేసింది అని అంటున్నాయి  టాలీవుడ్ వర్గాలు. 

 

ప్రస్తతం ఆమె ఈ సినిమా కోసం గానూ సుకుమార్ తో పూర్తి స్థాయి లో చర్చలు జరుపుతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆమె ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: