టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలతో మంచి హీరో గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజ్ తరుణ్. బాబు సినిమాలు అన్నీ కూడా మొదట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అతను ఒక్కటి అంటే ఒక్క హిట్ కూడా లేక నానా ఇబ్బందులు పడుతున్నాడు అనేది వాస్తవం. ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకునే విధంగా అతని పరిస్థితి ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రాజ్ తరుణ్ చాలా వరకు ఖాళీ గానే ఉన్నాడు. అతనికి పెళ్లి అనే వార్తలు వచ్చినా ఆ తర్వాత ఏ అడుగు ముందుకు పడలేదు. 

 

ఇప్పుడు అతను ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అతను ఒక స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో లేదా మహేష్ బాబు పరుశురాం సినిమాలో అతను నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాల్లో అతనికి ఏ పాత్ర ఇవ్వాలి అనే దాని మీద దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తను పైకి వచ్చినా సరే కెరీర్ లో చేసిన చిన్న చిన్న తప్పులు అతన్ని బాగా ఇబ్బంది పెట్టాయి అనేది వాస్తవం. 

 

అతను చేసిన సినిమాల్లో అతనికి వచ్చిన యూత్ ఫాలోయింగ్ ని అతను వాడుకోలేదు అనేది కూడా వాస్తవం. చిన్న హీరోలు అందరూ వరుసగా ఏ ఇమేజ్ లేకపోయినా సరే సినిమాలు చేస్తున్నా అతను మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నాడు అనే ప్రచారం కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. అతనికి మంచి పరిచయాలు ఉన్నాయి. అయినా సరే వాటిని అతను వాడుకునే ప్రయత్నం ఏ విధంగా కూడా చేయడం లేదు అని తెలుస్తుంది. ఇప్పుడు అయినా సరే అతని దశ తిరుగుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: