పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ , దేవి శ్రీప్రసాద్  కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యిందో తెలిసిందే. సరిగ్గా ఈ  సినిమా విడుదలై ఈ రోజు కు 8 ఏళ్ళు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ ఓ సప్రైజ్ అప్డేట్ ఇచ్చాడు. హరీష్ మరో సారి పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయనున్నాడని తెలిసిందే.  ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇక గబ్బర్ సింగ్ విజయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పాత్ర గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సాంగ్స్, ఆర్ఆర్ విషయంలో దేవి అద్భుతమైన అవుట్ ఫుట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మరో సారి పవన్, హరీష్ తో కలిసి పనిచేయనున్నాడు. పవన్ 28వ సినిమాకు దేవి సంగీతం అందించనున్నాడని హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. వచ్చే ఏడాది  ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇదిలావుంటే ప్రస్తుతం పవన్ రెండు సినిమాలతో బిజీ గావున్నాడు. అందులో వకీల్ సాబ్ ఒకటి. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నఈ చిత్రం పింక్ రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాతోపాటు పవన్ , క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తన 27వ సినిమాలో కూడా నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: